నిర్భయ దోషులకు మరణశిక్ష: ఉరితీసేది ఈ తేదీనే

By Siva KodatiFirst Published Jan 7, 2020, 4:51 PM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ నిందితులకు మరణశిక్ష ఎప్పుడనే దానిపై ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 22న నిర్భయ నిందితులకు ఉరిశిక్షను విధించాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ నిందితులకు మరణశిక్ష ఎప్పుడనే దానిపై ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 22న నిర్భయ నిందితులకు ఉరిశిక్షను విధించాల్సిందిగా ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజున ఉదయం 7 గంటల లోపు నలుగురు దోషులను ఉరి తీయాల్సిందిగా కోర్టు తీహార్ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో నలుగురు దోషులకు సుప్రీంకోర్టు గతంలోనే ఉరిశిక్ష విధించింది. దీంతో దోషులు నలుగురు తమపై కరుణ చూపాలని, శిక్షను తగ్గించాల్సిందిగా వీరు కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. అప్పుడు కూడా సుప్రీంకోర్టు మీరు చేసింది చాలా దారుణమైన, క్రూరమైన నేరం కాబట్టి, మీకు పిటిషన్ వేసే అర్హత కూడా లేదని చెప్పి వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

Also Read:నిర్భయ దోషులకు ఉరి... ఈసారి డేట్ ఫిక్స్

నిర్భయ కేసులో దోషులకు మరణశిక్ష అమలులో జాప్యం జరుగుతుండటంతో బాధితురాలి తల్లి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిగింది.

దోషులకు సంబంధించి ఏ కోర్టులోనూ, రాష్ట్రపతి ముందుగానీ ఎలాంటి పిటిషన్లు పెండింగ్‌లో లేవని, అంతేకాక దోషుల రివ్యూ పిటిషన్లను సుప్రీం కొట్టివేసిన సంగతిని నిర్భయ తల్లితరపు న్యాయవాది వాదించారు.

అయితే తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలున్నాయని దోషుల తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పాటియాలా కోర్టు తీర్పు వెలువరించడానికి ముందు నలుగురు దోషులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.

అనంతరం నలుగురు దోషులు వినయ్ శర్మ, ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌లకు న్యాయస్థానం డెత్ వారెంట్ జారీ చేసింది. అదే సమయంలో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడానికి దోషులకు కోర్టు 14 రోజుల గడువు ఇచ్చింది. 

అయితే... నలుగురుని ఒకేసారి ఉరితీయడం... దేశచరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా... సరిగ్గా 7 సంవత్సరాల క్రితం 2012 డిసెంబర్ లో  దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతిపై అత్యంత పాశవికంగా ఆరుగురు వ్యక్తులు కదిలో బస్సులో అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను నడి రోడ్డుపై ఒంటిపై నోలుపోగు కూడా లేకుండా వదిలేశారు. 

Also Read:నిర్భయ దోషులకు ఉరి... నొప్పి తెలియకుండా ఉండేందుకు.

ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో బీరు సీసాలను గుచ్చి ఆమెకు నరకం చూపించారు. దాదాపు 13 రోజులపాటు వెంటిలేటర్ పై చికిత్స పొందితన నిర్భయ... చివరకు ప్రాణాలు వదిలేసింది. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేయగా... అందులో ఒకరు మైనర్ కావడం గమనార్హం. మరో దోషి.. జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు దోషులకు ఇప్పుడు ఉరివేయనున్నారు. 

click me!