నోరు జారిన మాజీ సీఎం... మండిపడుతున్న నెటిజన్లు

Published : Mar 06, 2019, 01:45 PM IST
నోరు జారిన మాజీ సీఎం... మండిపడుతున్న నెటిజన్లు

సారాంశం

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నోరుజారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు.  

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నోరుజారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు.  నుదిటిపై కుంకుమ బొట్టు, విబూది పెట్టుకున్న వారిని చూస్తే..తనకు భయమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. సిద్ధరామయ్య మంగళవారం బాదామిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా అర్చకులు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రసంగించిన సిద్ధరామయ్య నుదుటిపై బొట్టు పెట్టుకున్న వ్యక్తిని చూపిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘నుదుటిపై పొడవైన కుంకుమ బొట్లు, విభూది పెట్టుకున్న వారిని చూసి నేను భయపడుతున్నాను. మీరు నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. అయితే సక్రమంగా పని చేస్తారా?. ఎవరైనా సరే సకాలంలో వారికి కేటాయించిన పనిని సక్రమంగా పూర్తి చేయాలి. నుదిటిపై పొడవైన బొట్లు పెట్టుకున్నవారిని చూస్తే నాకు ఎందుకు భయమేస్తుందో అర్థం కావడం లేద’ని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు సిద్దరామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu