మోదీ చీరలు.. హాట్ కేకుల్లా అమ్ముడౌతున్నాయి

Published : Mar 06, 2019, 12:49 PM IST
మోదీ చీరలు.. హాట్ కేకుల్లా అమ్ముడౌతున్నాయి

సారాంశం

దేశ ప్రధాని నరేంద్రమోదీని అభిమానించేవారు చాలా మందే ఉన్నారు. ఆయనపై తమకు ఉన్న అభిమానాన్ని, ప్రేమను ఏదో రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు.

దేశ ప్రధాని నరేంద్రమోదీని అభిమానించేవారు చాలా మందే ఉన్నారు. ఆయనపై తమకు ఉన్న అభిమానాన్ని, ప్రేమను ఏదో రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు.

కొందరు పెళ్లి కార్డులపై ఫోటోలు చిత్రీకరిస్తే... మరికొందరు నాణేలపై ముద్రించడం లాంటివి చేసేవారు. కాగా.. తాజాగా ఓ వ్యాపారి.. మోదీపై అభిమానాన్ని చాటుకుంటూనే.. తన వ్యాపారాన్ని మెరుగుపరుచుకున్నాడు.

తాజాగా, సూరత్‌లోని ఓ బట్టల దుకాణం మోదీ చిత్రాలతో కూడిన చీరలను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. లోక్‌సభ ఎన్నికల ముందు ఆ చీరలను అందుబాటులోకి తేవడంతో హాటుకేకుల్లా అమ్ముడుపోతున్నాయట. 

నాలుగు రకాల డిజైన్లతో వివిధ రంగుల్లో లభ్యమవుతున్న ఈ చీరలపై ఒకవైపు మోదీ చిత్రం, మరోవైపు రద్దైన రూ.వెయ్యినోటును డిజిటల్‌ ప్రింట్‌ చేశారు. ఇంకా పలువురు రాజకీయ నాయకుల చిత్రాలతో చీరలను మార్కెట్‌లోకి తీసుకొస్తామని నిర్వాహకులు అంటున్నారు. ఈ చీరలు ఆన్ లైన్ లో కూడా లభిస్తుండటం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Richest MLAs in India | టాప్ 10 ధనిక ఎమ్మెల్యేలు వీరే..నలుగురు తెలుగువారే! | Asianet News Telugu
Bhajan Clubbing : మోదీ మెచ్చిన భజన్ క్లబ్బింగ్.. ఇందులో అంత కిక్ ఏముంది? అసలు ఏంటిది?