పిజ్జా కంటే ఫాస్ట్ గా లిక్కర్ డెలివరీ.. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే ఇంటి ముందుకు..

Published : Jun 03, 2022, 09:11 AM IST
పిజ్జా కంటే ఫాస్ట్ గా లిక్కర్ డెలివరీ.. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే ఇంటి ముందుకు..

సారాంశం

హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ కోల్ కతాలో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. ఆర్డర్ ఇచ్చిన పది నిమిషాల్లోనే మద్యం సరఫరా చేయనుంది. 

కోల్కతా :  Online trend ను క్యాష్ చేసుకోవాలనుకుందో Startup Company. దాదాపుగా అన్నీ ఆన్ లైన్ లోనే దొరికేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల App లు దీనికి సంబంధించిన అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, ఇప్పుడంతా ఆన్లైన్ ఆర్డర్ల హవా నడుస్తోంది. నిమిషాల వ్యవధిలోనే కోరుకున్న కూరగాయలు, దుస్తులు, ఆట బొమ్మలు  వంటివన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. మరి తమ వ్యాపారం ఎలా.. ఏది చేస్తే లాభాలొస్తాయి. అని ఆలోచించిందో స్టార్టప్ కంపెనీ..

అంతే, ఆన్ లైన్ ఇదే బాటలో Alcohol సరఫరాను కొత్తపుంతలు తొక్కించాలనుకుంది హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇంకేముంది దీనికో పేరు కూడా క్రియేట్ చేసి రంగంలోని దిగింది.  ’బూజీ‘  బ్రాండ్ పేరుతో కోల్కతాలో వినూత్న సేవలను తాజాగా ప్రారంభించింది. ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో లిక్కర్ ను డెలివరీ చేయడం దీని ప్రత్యేకత. మరి ఇప్పటివరకు ఆన్ లైన్ లో మద్యం అందుబాటులో లేదా అంటే.. ఎందుకు లేదూ...  వాస్తవానికి ఇప్పటికే పలు కంపెనీలు ఆన్లైన్ లో మద్యం డెలివరీ సర్వీసులను అందిస్తున్నాయి. 

అయితే, ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే.. మద్యం మీ ఇంటిముందుకు చేర్చే సేవలను అందిస్తున్న కంపెనీ మాత్రం తమదేనని ఎండోమెంట్ టెక్నాలజీస్ ఒక ప్రకటనలో తెలిపింది. అదన్నమాట.. మందేయాలనుకుంటే ఆగేది ఉండదు కదా.. అందుకే అనుకున్నదే తడవుగా కళ్లముందు ప్రత్యక్షం అన్నమాట. దీనికోసం పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకుని ఈ సర్వీసును ప్రారంభించినట్లు వెల్లడించింది. 

ఇదిలా ఉండగా, మద్యం చేసే గమ్మత్తుల్లో ఒకటి మే 9న తెలంగాణలోని మంచిర్యాలలో జరిగింది. liquor తాగడం వల్ల మనిషి ప్రాణాలు నెమ్మదిగా హరిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే మద్యం మత్తు మాత్రం క్షణాల్లో ప్రాణాలు తీస్తుంది. ఘోరాలు చేయిస్తుంది. అలాంటి ఘటన Manchiryalaలో జరిగింది. మద్యం మత్తులో నీళ్లు అనుకుని acid ను కలుపుకుని తాగి ఓ వ్యక్తి మృతి చెందిన చెందాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్ల హాజీపూర్ మండలం ముల్కల్లలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రవేని మహేష్ (29) సింగరేణిలో ఉద్యోగం చేస్తాడు. గతనెల 18న Alcohol intoxicationలో మంచినీరు అనుకుని యాసిడ్ బాటిల్ లోని యాసిడ్ ను మద్యంలో కలుపుకుని తాగాడు. 

దీంతో అపస్మారక స్థితిలోకి చేరాడు. ఇది గుర్తించిన అతడి కుటుంబసభ్యలు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి చికిత్స పొందుతున్న అతను ఈ రోజు మృతి చెందినట్లు హాజీపూర్ ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. మహేష్ కు తండ్రి శంకరయ్య, తల్లి లక్ష్మి, భార్య స్వర్ణలత, కుమారుడు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !