
మూడు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మే నెల 31వ తేదీన ఆయా స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కేరళలోని త్రిక్కకర, ఉత్తరాఖండ్ లోని చంపావత్, ఒడిశాలోని బ్రజ్ రాజ్ నగర్ స్థానాలకు అధికారులు ఉప ఎన్నికలు నిర్వహించి, ఈవీఎంలను భద్రపరిచారు. ఆ ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు నేడు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీని కోసం కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చంపావత్ అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి పోటీ చేశారు. ఆయనపై కాంగ్రెస్ కు చెందిన నిర్మలా గహ్టోరి పోటీలో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖతిమా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ధామి కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కాప్రి చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన ఆధ్వర్యంలోని బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో అధిష్టానం మరో సారి ఆయనకే సీఎం పగ్గాలను అప్పగించింది.
‘‘ హిందువులు తమకు వ్యతిరేకం అని ముస్లింలు అనుకోవద్దు ’’- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
అయితే అతడు నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోపు శాసనసభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది. ఇది తన పదవిని నిలుపుకోవడానికి ఇది రాజ్యాంగపరమైన ఆవశ్యకత. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కైలాష్ గెహ్టోరి తన పదవికి రాజీనామా చేశారు. అక్కడి నుంచే సీఎం రంగంలోకి దిగారు. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, గోరల్చోడ్ మైదానంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చంపావత్ జిల్లా ఎన్నికల అధికారి నరేంద్ర భండారీ తెలిపారు.
ఒడిశా రాష్ట్రం ఝార్సుగూడ జిల్లాలోని బ్రజరాజ్ నగర్ నియోజకవర్గం కూడా మంగళవారం పోలింగ్ జరిగింది. ఇక్కడ 71.90 శాతం పోలింగ్ నమోదైంది. 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, బీజేడీకి చెందిన అలకా మొహంతి, బీజేపీకి చెందిన రాధారాణి పాండా మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో ఎమ్మెల్యే కిశోర్ మొహంతి మరణించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ స్థానం నుంచి బీజేడీ దివంగత నేత భార్య అల్కా మొహంతిని పోటీలో దించారు. బీజేడీ ఎన్డీయేలో కూటమిలో ఉన్నప్పటికీ ఈ స్థానం నుంచి మాత్రం రెండు పార్టీలు విడివిడిగా పోటీలో నిలిచాయి. మరి విజయం ఎవరిని వరిస్తుందో నేడు తేలిపోనుంది.
లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయని కాశ్మీర్‌కు చెందిన వ్యక్తిని అరెస్టు చేసిన మహారాష్ట్ర ఏటీఎస్
కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని త్రిక్కకర అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తంగా ఇక్కడ 68.75 శాతం పోలింగ్ నమోదైంది, ఇది నియోజకవర్గ చరిత్రలోనే అత్యల్పం. ఇక్కడ కాంగ్రెస్ నాయకురాలు ఉమా థామస్, సీపీఐ(ఎం)కు చెందిన డాక్టర్ జో జోసెఫ్ ల మధ్య పోటీ ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 14,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ సీనియర్ నేత పీటీ థామస్ విజయం సాధించారు. అయితే ఆయన కొంత కాలం కిందట మరణించారు. దీంతో కాంగ్రెస్ అతడి భార్య ఉమా థామస్ ను బరిలోకి దింపగా, సీపీఎం యువ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ జో జోసెఫ్‌ను రంగంలోకి దింపింది. బీజేపీ కూడా తన అభ్యర్థి ఎఎన్ రాధాకృష్ణన్ ను ఈ స్థానంలో పోటీలో నిలిపింది.