యూపీలో జడ్పీ ఛైర్ పర్సన్ గా తెలంగాణ మహిళ...

By AN TeluguFirst Published Jul 5, 2021, 9:35 AM IST
Highlights

సూర్యాపేట జిల్ల నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి ఉత్తర్ ప్రదేశ్ లోని జన్పూర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్ రెడ్డి కుమార్తె ఈమె.
 

సూర్యాపేట జిల్ల నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి ఉత్తర్ ప్రదేశ్ లోని జన్పూర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్ రెడ్డి కుమార్తె ఈమె.

గతంలో కోదాడ నియోకవర్గ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న శ్రీకళారెడ్డి యూపీకి చెందిన ధనుంజయ్ తో వివాహమయ్యింది. ఆ తరువాత బీజేపీలో చేరారు. ఇటీవల అక్కడ జరిగిన పరిషత్ ఎన్నికల్లో పోటీచేసి జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తరువా జన్పూర్ పరిషత్ చైర్ పర్సన్ గా ఎన్నుకున్నారు. 

83 మంది సభ్యుల జిల్లా పరిషత్‌లో బిజెపికి 28, సమాజ్‌వాదీ పార్టీ 12 మందికి వ్యతిరేకంగా 43 మంది సభ్యుల మద్దతు ఆమెకు లభించింది. 

శ్రీకళారెడ్డి అనే ఆమె పేరు మినహా, ఆహార్యం, మనుషులతో కలిసిపోవడం, తీరు అంతా పక్కా ఉత్తరప్రదేశ్ లోకల్ లాగే కనిపిస్తారు. అందుకే జౌన్‌పూర్ జిల్లా పరిషత్‌కు కొత్తగా చైర్‌పర్సన్ గా ఎన్నికకాగలిగారు. ప్రచార సమయంలోనూ ఆమె ప్రజలతో సులభంగా కలిసిపోయారు. స్వతంత్ర్య అభ్యర్థిగా గెలవడమే కాదు, జిల్లా పరిషత్‌ చైర్ పర్సన్గా ఎన్నికవ్వడం తో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రికార్డును సృష్టించింది.

ఆమెభర్త ధనంజయ్ సింగ్‌ బహుజన్ సమాజ్ పార్టీ మాజీ ఎంపి. ఆమె రాజకీయానుభవం, భర్త రాజకీయాలు, యుక్తి ఆమెను జిల్లాలో ఆరవ మహిళా చీఫ్ కావడానికి సహాయపడింది. ఉత్తరభారత ప్రజలు ముఖ్యంగా యుపి వాళ్లు దక్షిణాది నుంచి వచ్చే రాజకీయనాయకులను ఓపెన్ హార్ట్ తో స్వీకరిస్తారని అన్నారు. అంటూ జయప్రద, హేమ మాలిని లను ప్రస్తావించారు. 

ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలు తమ కుటుంబాన్ని బాగా వేధించాయలని ఆమె ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ధనుంజయ్ సింగ్ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో పరారీలో ఉన్నాడు. 

“నా భర్త మాస్ లీడర్,  ప్రజల మద్దతు ఉంది. ఇలాంటి వ్యక్తిని ప్రత్యర్థి పార్టీ వాళ్లు కేసులలో ఇరికించడం సహజమే”అని ఆమె అన్నారు. ఒక పార్టీ తన నలుగురు మద్దతుదారులను కిడ్నాప్ చేసిందని, అయితే చివరికి విజయం తనదేనని ఆమె చెప్పుకొచ్చారు. 

మాది రాజకీయ కుటుంబం అని శ్రీకళా రెడ్డి చెప్పారు.  తండ్రి కె. జితేందర్ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. 1969 లో సూర్యాపేట కోదాడ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శ్రీకళారెడ్డి బిజెపిలో చేరి, 2019 ఉప ఎన్నిక సమయంలో హుజుర్నగర్ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ బిజెపి మరొక అభ్యర్థిని ఎన్నుకుంది. 

ఆమె 2017లో చెన్నైలో ధనంజయ్ సింగ్‌ను వివాహం చేసుకుంది. ఆ సమయంలో ఆమె పెళ్లికి తెలుగు సినీ హీరో అల్లు అర్జున్ సహా ప్రముఖులు పాల్గొన్నారు.

click me!