భార్య గొడవపడుతుంటే ఈ భర్త ఏం చేశాడో తెలుసా?

Published : Mar 29, 2023, 09:35 AM IST
  భార్య గొడవపడుతుంటే ఈ భర్త ఏం చేశాడో తెలుసా?

సారాంశం

 ఒకనొక స్టేజ్ లో వారి భాగస్వామి కూడా ఎదురుతిరుగుతారు. దీంతో...వారి మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. అయితే... భార్య గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవ బారి నుంచి తప్పించుకోవడానికి ఓ భర్త మాస్టర్ ప్లాన్ వేశాడు.

భార్యభర్తల మధ్య గొడవలు రావడం సహజం. ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఏదో ఒక విషయంలో కోపం రావడం కూడా అంతే సహజం. అలా కోపం వచ్చినప్పుడు ఇద్దరూ వాదించుకుంటూ పోతే... గొడవ పెద్దదిగా మారుతుంది. అలా కాకుండా ఒకరు అరుస్తున్నప్పుడు మరొకరు శాంతంగా ఉంటే... ఆ గొడవ అక్కడితోనే ముగుస్తుంది. కానీ... అవతల ఒక వ్యక్తి తమపై గట్టి గట్టిగా అరుస్తుంటే... మనం శాంతంగా ఎలా ఉండగలం. ఎంతసేపని కోపాన్ని ఆపుకోగలం. ఒకనొక స్టేజ్ లో వారి భాగస్వామి కూడా ఎదురుతిరుగుతారు. దీంతో...వారి మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. అయితే... భార్య గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవ బారి నుంచి తప్పించుకోవడానికి ఓ భర్త మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ వీడియోని నెట్టింట షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇంతకీ ఆ భర్త వేసిన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని ఉందా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.

 

వీడియోలో ఓ మహిళ తన భర్తపై చాలా కోపంగా ఉంది. అతన్ని తెగ తిట్టేస్తోంది. ఆ తిట్ల నుంచి తప్పించుకోవడానికి అతను వెంటనే మిక్సర్ ఆన్  చేశాడు. భార్య గొంతు పెంచిన ప్రతిసారీ... అతను మిక్సీ స్పీడు పెంచుతున్నాడు. ఆ మిక్సీ గోలకు ఆమె భర్తను తిట్టడం ఆపేసింది. ఆ తర్వాత అతను ప్రశాంతంగా  మిక్సీ ఆఫ్ చేసి.. పక్కకు వెళ్లి రిలాక్స్ అయ్యాడు. దీనిని రీల్ గా చేసి ఓ దంపతులు షేర్ చేయగా.. వైరల్ గా మారింది. అతని తెలివికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సూపర్ ఐడియా బ్రదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పెద్ద మనసుతో ఆదుకున్నారు..అందులో తప్పేంటీ? | Government jobs for Karur victims | CM Vijay
BJP : తెలంగాణ బిజెపికి బిగ్ షాక్... జాతీయ స్థాయిలో ఉన్న రెండు పదవులూ పాయే..!