కునో నేషనల్ పార్క్ లో చీతా మృతిపై రాజకీయ రగడ..అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఎందుకు తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ విమర్శలు

By Asianet NewsFirst Published Mar 29, 2023, 7:48 AM IST
Highlights

కునో నేషనల్ పార్క్ లో మూడు రోజుల అనారోగ్యంతో ఆడ చిరుత చనిపోయింది. అయితే ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఆ జంతువు అనారోగ్యంతో ఉందని తెలిసినా ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించింది. 

మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ (కేఎన్పీ)లో మూత్రపిండాల వైఫల్యంతో ఐదేళ్ల ఆడ చిరుత సాషా మరణిచింది. అయితే దీనిపై రాజకీయ రగడ మొదలైంది. ఇప్పుడు చనిపోయిన చిరుతతో పాటు మరో ఏడింటిని ప్రధాని నరేంద్ర మోదీ 72వ జన్మదినం సందర్భంగా అక్కడ విడుదల చేసిన ఆరు నెలల తర్వాత ఇది రాష్ట్రంలో రాజకీయ అంశంగా మారుతోంది.

ఆ కుటుంబం పార్టీకి ఇరుసు లాంటిది.. పార్టీలో ఐక్యత ఆ కుటుంబంతోనే : అశోక్ గెహ్లాట్

మూత్రపిండాలు దెబ్బతిన్న చిరుతను ప్రధాని మోదీ తన 72వ జన్మదినం సందర్భంగా కేఎన్పీలో  ఎందుకు విడుదల చేశారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మీడియా విభాగం అధిపతి కెకె మిశ్రా ప్రశ్నించారు. చనిపోయిన ఆడ చిరుత ఫోటోను ట్వీట్ చేస్తూ.. ‘‘ఇది ఆడ చిరుత కళేబరం మాత్రమే కాదు.. బీజేపీ ప్రభుత్వ సిగ్గుమాలిన ఘటన కళేబరం కూడా.. అప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిరుతను ఏ ప్రాతిపదికన భారతదేశానికి తీసుకురావడానికి ఎంపిక చేశారు? మనుషుల తర్వాత ఇప్పుడు జంతువుల విషయంలో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఆ చిరుతను ఇండియాకు తరలించే ముందు శస్త్రచికిత్స జరిగింది’’ అని తెలిపారు.

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మీడియా సలహాదారు పీయూష్ బబేలే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్ కూడా ట్విట్టర్ ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘‘మోడీ శకంలోని మరో ఘటనకు ఇది విషాదకరమైన ముగింపు. 70 సంవత్సరాల తరువాత చిరుతలు భారతదేశానికి తిరిగి వచ్చినందుకు గుర్తుగా వార్తాపత్రికలలో ఫుల్ పేజీ ప్రకటనలు వచ్చాయి. రోజుల తరబడి చిరుతల విజయగాథ మీడియా పతాక శీర్షికలలో ఆధిపత్యం వహించింది. ప్రధాని స్వయంగా విడుదల చేసిన చిరుతల్లో ఒకటి చనిపోయింది’’ అని తెలిపారు.

ఢిల్లీలో అమృత్ పాల్ సింగ్ ? తలపాగా లేకుండా, మాస్క్ పెట్టుకొని కనిపించిన సీసీటీవీ పుటేజీ వెలుగులోకి..

ఇదిలావుండగా.. సాషా శవపరీక్షలో మూత్రపిండాల వైఫల్యమే మరణానికి కారణమని తేలిందని సీనియర్ అటవీ శాఖ అధికారి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) జేఎస్ చౌహాన్ మంగళవారం తెలిపారు. నమీబియా, దక్షిణాఫ్రికా వెటర్నరీ నిపుణులతో సంప్రదింపులు జరిపి సాషా ప్రాణాలను కాపాడేందుకు మధ్యప్రదేశ్ లోని వెటర్నరీ స్పెషలిస్టులు తమ వంతు కృషి చేశారని, కానీ కిడ్నీ శాశ్వతంగా దెబ్బతినడంతో దానిని కాపాడలేకపోయారని తెలిపారు. 2023 ఫిబ్రవరి 18 న 12 చిరుతలను సజావుగా తరలించడాన్ని పర్యవేక్షించడానికి గత నెలలో కేఎన్పీకి వచ్చిన దక్షిణాఫ్రికా అగ్రశ్రేణి నిపుణులు కూడా తమ ఉత్తమ చికిత్సను అంగీకరించారని చెప్పారు. అయితే మిగతా 19 చిరుతలు (2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి తీసుకువచ్చిన మరో ఏడు, 2023 ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 12 చిరుతలు) కేఎన్పీలో పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాయని చౌహాన్ తెలిపారు.

కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం.. 18 ఫార్మా కంపెనీల లైసెన్సులు రద్దు

దీనిపై భోపాల్ కు చెందిన వన్యప్రాణి కార్యకర్త అజయ్ దూబే మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటనపై మధ్యప్రదేశ్ అటవీ శాఖ ఉన్నతాధికారులు విచారణ జరపాలి. చిరుతలను భారతదేశానికి తీసుకురావడానికి ముందు, వాటి నిర్వహణను నేర్చుకోవడానికి అక్కడికి వెళ్లిన రాష్ట్ర అటవీ మంత్రి, సీనియర్ అటవీ శాఖ అధికారుల ఆఫ్రికన్ పర్యటనలకు పెద్ద మొత్తంలో ప్రజాధనం ఖర్చు అయ్యింది. అలాంటప్పుడు అనారోగ్యంతో ఉన్న చిరుతను భారత్ కు ఎందుకు తీసుకొచ్చారు?’’ అని ప్రశ్నించారు. 

click me!