
Mumbai crime: ఒక భర్త తన భార్యను కత్తితో పొడిచి తర్వాత తాను ఉరివేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు, విచారణ జరుపుతున్నారు. మృతుడు శివన్ (64)పై హత్యాయత్నం కేసు నమోదు చేయగా, కవిత (54) అనే మహిళ నగరంలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలోని ఐసీయూలో మృత్యువుతో పోరాడుతోందని పోలీసులు తెలిపారు.
ఈ షాకింగ్ ఘటన గురించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి... 64 ఏళ్ల వృద్ధుడు తన భార్యను కత్తితో పొడిచి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని ములుంద్ ఈస్ట్ లో గురువారం సాయంత్రం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కుమార్తె దాన్యా ఇరుగుపొరుగు వారి సాయంతో ఇంట్లోకి వెళ్లింది. ఈ క్రమంలో తల్లి రక్తపు మడుగులో ఉండగా, తండ్రి పడకగదిలో ఉరేసుకుని కనిపించాడని పోలీసులు తెలిపారు.
మృతుడు శివన్ (64)పై హత్యాయత్నం కేసు నమోదు చేయగా, కవిత (54) అనే మహిళ నగరంలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలోని ఐసీయూలో మృత్యువుతో పోరాడుతోంది. ములుంద్ అగ్నిమాపక దళానికి సమీపంలోని డెస్టినీ హైట్స్ వద్ద ఈ ఘటన జరిగింది. గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో దాన్యా ఇంటికి వచ్చి చూసేసరికి తలుపు లోపలి నుంచి లాక్ వేసి ఉంది. బెల్ మోగించి తల్లి సెల్ ఫోన్ కు కూడా పలుమార్లు కాల్ చేసింది. అయితే లోపల ఫోన్ మోగుతున్న శబ్దం విన్న ఆమెకు అనుమానం వచ్చి ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేసింది. వారు తలుపులు పగులగొట్టి చూడగా ఈ షాకింగ్ దృశ్యాలు కనిపించాయిని పోలీసులు తెలిపారు.
"ఆమె తల్లి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. తండ్రి కోసం వెతికితే బెడ్రూమ్ లోపలి నుంచి తాళం వేసి ఉండడంతో అది పగలగొట్టి చూడగా తండ్రి సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు" అని నవ్‌ఘర్ పోలీసు అధికారి తెలిపారు. శివన్ పళని అక్కడికి వచ్చేసరికి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించగా, కవితను ఫోర్టిస్ ఆస్పత్రి ములుంద్ కు తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
శివన్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, రెండు నెలల క్రితం పునరావాస కేంద్రానికి పంపించారని కుమార్తె తెలిపింది. శివన్ పై ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసినట్లు నవ్‌ఘర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జయవంత్ సంక్‌పాల్ తెలిపారు.