గుప్తనిధి కనబడాలంటే.. నా ముందు స్త్రీని నగ్నంగా కూర్చోబెట్టాలి.. పూజారి ఘాతుకం...

By AN TeluguFirst Published Nov 12, 2021, 1:06 PM IST
Highlights

పాతకాలం నాటి ఇళ్లు, పూర్వకాలపు ఇళ్లలో గుప్తనిధులు ఉంటాయని శ్రీనివాస్ కి చెప్పాడు. అంతేకాదు వాటిని బయటకు తీయకపోతే ఆ ఇంట్లో ఉంటున్న కుటుంబసభ్యలు చాలా ఆపదలు ఎదుర్కొంటారని శ్రీనివాస్ తో చెప్పాడు.

బెంగళూరు :  కంప్యూటర్లు వచ్చి ఎంతటి ఆధునికయుగంలో జీవిస్తున్నప్పటికీ ఇంకా  ఇలాంటి మూఢనమ్మకాలను కొంతమంది విశ్వసిస్తున్నారు అంటే వాళ్లను ఏమనాలో కూడా అర్థం కాదు.  అంతెందుకు ఒక చిన్న గ్రామం సైతం అత్యంత అభివృద్ధి పథంలోకి దూసుకుపోతున్నా... ఇంకా ఇలాంటి అమానుష ఘటనలకు  తెరలేపుతున్నవారు అక్కడక్కడ  తారసపడుతూనే ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం.  అచ్చం అలాగే ఇక్కడ ఒక పూజారి గుప్తనిధులంటూ ఎలాంటి పని చేసాడో చూస్తే మనం ఏ యుగంలో ఉన్నాం అని అనిపించక మానదు.

అసలు విషయంలోకి వెళితే.. షాహి కుమార్ తమిళనాడుకు చెందిన వాడు.  కర్ణాటకలోని భూనహళ్లికి  చెందిన  వ్యవసాయదారుడు శ్రీనివాస్ అనే వ్యక్తికి ఒక పెళ్లి లో పూజలు చేసే Shahi Kumar అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య సంభాషణ నడిచింది. షాహి కుమార్ చెప్పే విషయాల మీద శ్రీనివాస్ కు ఆసక్తి ఏర్పడింది. అలా వారి పరిచయం పెరిగింది.

ఈ క్రమంలో ఒకరోజు  ఈ షాహి కుమార్.. Srinivas ఇంటికి వచ్చాడు. అయితే శ్రీనివాస్ ఇల్లు 75 సంవత్సరాల క్రితం నిర్మించిన పాత ఇల్లు. ఇంటిని బాగా గమనించిన షాహికుమార్. ఇలాంటి చాలా పాతకాలం నాటి ఇళ్లు, పూర్వకాలపు ఇళ్లలో Hidden treasures ఉంటాయని శ్రీనివాస్ కి చెప్పాడు. అంతేకాదు వాటిని బయటకు తీయకపోతే ఆ ఇంట్లో ఉంటున్న కుటుంబసభ్యలు చాలా ఆపదలు ఎదుర్కొంటారని శ్రీనివాస్ తో చెప్పాడు.

దీనికి పరిష్కారం ఏంటి అని అడిగిన శ్రీనివాస్ కు గుప్తనిధులు బయటికి తీయడమేనని చెప్పాడు. ఆ పని తాను చేస్తానని. ఈ మేరకు  షాహి కుమార్  గుప్త నిధులు  తీసే నిమిత్తం  శ్రీనివాస్ నుంచి  అడ్వాన్స్ గా రూ. 20 వేలు కూడా తీసుకున్నాడు. అయితే అప్పటికే కొవిడ్-19 విపరీతంగా పెరిగిపోవడం.. ప్రభుత్వాలు లాక్డౌన్ లు విధించడంతో ఈ పనులు వాయిదా పడుతూ వచ్చాయి. ఆ తర్వాత రెండు నెలలకు శ్రీనివాస్ ని కలిసి పని ప్రారంభిస్తానని చెప్పాడు. 

దీనికి శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. దీంతో షాహి కుమార్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. ముందు ఈ గుప్తనిధుల నిమిత్తం చేసే Worship కోసం  శ్రీనివాస్ కుమార్  ఇంట్లోని  ఓ గదిని ఎన్నుకున్నాడు. ఆ తరువాత తన మనసులోని అసహ్యకరమైన ఆలోచనను శ్రీనివాస్ ముందు ఉంచాడు. 

కొవాగ్జిన్ మూడో దశ ఫలితాలు ప్రచురించిన లాన్సెట్.. డెల్టా వేరియంట్‌పై సామర్థ్యం ఎంతంటే?

అదేంటంటే.. ఈ నిధి కనబడాలంటే ఒక స్త్రీని తన ముందు nudeగా కూర్చోబెడితే గుప్త నిధి కనబడుతుందని, లేకపోతే గుప్తనిధులు అంత తొందరగా కళ్లముందుకు రావని నమ్మించాడు. అంతేకాడు ఆ woman కూడా శ్రీనివాస్ కుటుంబానికి  చెందినవారై ఉండాలని పట్టుపట్టాడు. దీనికి అంగీకరించని శ్రీనివాస్ వేరే స్త్రీని ఏర్పాటు చేస్తానని ఎలాగో ఒప్పించాడు. ముందు దీనికి ఒప్పుకోని షాహికుమార్ తరువాత సరే అన్నాడు. దీంతో శ్రీనివాస్ ఈ పని నిమిత్తం ఒక దినసరి కూలీ మహిళకు ఐదు వేలు ఇచ్చి ఒప్పించి తీసుకువచ్చాడు.

అయితే Priest షాహి కుమార్ పనుల మీద స్థానికులకు అనుమానం వచ్చింది. వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి షాహి కుమార్ అతని సహాయకుడు మోహన్,  తాపీ మేస్త్రీలు లక్ష్మీ నరసప్ప, లోకేష్,  నాగరాజ్,  పార్థసారధి లను అదుపులోకి తీసుకున్నారు. వీరందరి మీద మోసం కేసు నమోదు చేశారు.  ఈ మేరకు పోలీసులు అక్కడ స్థానికుల చొరవతోనే ఈ  దినసరి  కూలీ మహిళలను, ఆమె  నాలుగేళ్ల కూతురుని  రక్షించగలిగామని చెప్పారు. 

click me!