
మధ్యప్రదేశ్ : అతను కొడుకు కోసం ఎంతగానో కలలు కన్నాడు. వారసుడు ఉండాలని పరితపించాడు. అయితే అతనికి ముగ్గురూ కూతుళ్లే పుట్టారు. దీంతో అతను తన భార్యను, పిల్లలను హాస్పిటల్ లోనే వదిలేశాడు. ఇంటికి రానివ్వలేదు.. కొడుకు కోసం మరో పెళ్లికి సిద్ధపడుతున్నాడు. అయితే ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పటికే కొడుకు ఉన్న ఓ మహిళను వివాహం చేసుకోబోతున్నాడు. దీంతో బాధిత మహిళ కలెక్టర్ను ఆశ్రయించింది.
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు సమీపంలోని Shivpuriకి చెందిన గోలూ జాతవ్ అనే వ్యక్తి 2016లో basanti అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత ఆమె ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మగ పిల్లాడి మీద మోజుతో అతను మూడో సారి ప్రయత్నించాడు. మూడోసారి కూడా ఆమెకు ఆడపిల్ల జన్మించింది. దీంతో అతను వారిని హాస్పిటల్లోనే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. వారిని ఇంటికి రానివ్వలేదు.. దీంతో తన ముగ్గురు పిల్లలతో కలిసి బసంతి పుట్టింటికి చేరింది. కాగా, మగపిల్లాడి కోసం గోలూ మరో వివాహానికి సిద్ధపడ్డాడు.
ఇప్పటికే మగపిల్లాడు ఉన్న ఓ మహిళను వివాహం చేసుకోబోతున్నాడు. ఆమె భర్త నుంచి విడిపోయి కొడుకుతో కలిసి వేరేగా ఉంటుంది. కేవలం వారసుడి కోసమే ఆమెను పెళ్లి చేసుకునేందుకు గోలూ రెడీ అవుతున్నాడు. ఈ విషయం తెలిసిన బసంతి తన భర్తను, అత్తింటి వారిని ఎంతగానో వేడుకుంది. వారు ఆమె మాట వినకపోవడంతో బసంతి జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 2న మగసంతానం కలిగిస్తామని చెప్పే నకిలీ స్వాములు గుట్టు రట్టయ్యింది. మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అంటే రాలగొట్టి చూపిస్తాం అంటూ ఈ నfake babaలు జనాల్ని మోసం చేస్తున్నారు. గుప్తనిధులు, సంతానం పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. lemon water తాగితే సంతానం కలుగుతుందంటూ నయా fraudకి తెరలేపిన ఈ నకిలీ బాబాలు గుట్టును పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెడితే...
నకిలీ స్వామి అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు బురిడీ బాబాలను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్ కు తరలించారు. సీఐ కృష్ణ మోహన్ కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాటి గ్రామానికి చెందిన పర్వతం స్వామి అలియాస్ నాగరాజు స్వామి, పర్వతం సైదులు అలియాస్ సహదేవ స్వామి, సిరసాల బక్కయ్య కలిసి స్వామి అవతారం ఎత్తి ‘మీ ఇంట్లో గుప్తనిధులు తీస్తాం, మేము మంత్రాలు చదివితే సర్వ రోగాలు మాయం అవుతాయి, మేమిచ్చే నిమ్మకాయ నీరు తాగితే సంతానం కలుగుతుందని’ ప్రజలను మోసం చేస్తున్నారు.
మండలంలోని కలకొండ, అన్నెబోయిన్పల్లి, అందుగుల, పరిసర గ్రామాల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేశారు. ప్రజల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి సుమారు రూ.13 లక్షలు స్వాధీనం చేసుకుని…రిమాండ్ కు పంపినట్లు చెప్పారు.