మాట్లాడాలని పిలిచి.. భార్య కాళ్లు నరికిన భర్త.. ఎందుకంటే....

Published : Mar 19, 2022, 08:47 AM IST
మాట్లాడాలని పిలిచి.. భార్య కాళ్లు నరికిన భర్త.. ఎందుకంటే....

సారాంశం

భార్య మీది అనుమానం విడాకులు తీసుకున్న తరువాత కూడా ఓ భర్తకు వదలలేదు. దీంతో దారుణానికి తెగబడ్డాడు. మాట్లాడాలని హోటల్ కు పిలిచి.. ఆమె కాళ్లు నరికేశాడు. 

బెంగళూరు : ఓ భర్త భార్య కాళ్ళు నరికి murder attempt  చేసిన ఘటన తుమకూరు నగరంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..  గదగ్ కు చెందిన బాబు, తుమకూరు మధుగిరికి చెందిన అనిత(30)కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోవాలని విడివిడిగా ఉంటున్నారు. ఇదే సమయంలో భార్య మీద murder plan రచించాడు భర్త. దీనిప్రకారం గురువారం ఉదయం నుంచి బాబు తుమకూరు చేరుకున్నాడు.

అనితను కూడా మాట్లాడుకుందామని పిలిపించాడు. ఇద్దరు ఓ హోటల్లో అల్పాహారం తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఓ లాడ్జ్ వద్ద ఉన్న ఓ నిర్జన ప్రదేశంలోకి చేరుకున్నారు అక్కడ గొడవపడ్డారు. పథకం ప్రకారం తీసుకువచ్చిన కత్తి తీసుకుని ఆమె కాళ్లు నరికాడు. అక్కడి నుంచి ఓ హోటల్కు వెళ్లి ఆ విషయాన్ని అక్కడి సిబ్బందికి చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించి నిందితుడిని అరెస్టు చేశారు. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం తట్టుకోలేక ఇలా చేశానని బాబు పోలీసులకు వివరించాడు. 

ఇదిలా ఉండగా, దామరచర్ల మండల కేంద్రంలో ఇటీవల చోటు చేసుకున్న వంట మాస్టర్ murder చిక్కుముడి వీడుతున్నట్లు తెలుస్తోంది. దామరచర్ల కు చెందిన  కుర్ర లింగరాజు (38) ఈనెల 12వ తేదీన రాత్రి మండల కేంద్రంలోని Railway tracks పక్కన దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు దామరచర్ల కు చెందిన లింగరాజుకు అదే ప్రాంతానికి చెందిన మల్లీశ్వరితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి  ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. లింగరాజు మండల కేంద్రంలోని గిరిజన Gurukul schoolలోకాంట్రాక్టు పద్ధతిలో cookIng masterగా పని చేస్తున్నాడు. 

కాగా, లింగరాజు మద్యానికి బానిస గా మారి అనుమానంతో మల్లీశ్వరిని వేధిస్తూనే వాడు. అతడి ప్రవర్తన తో విసుగు చెందిన మల్లేశ్వరి,  తన సోదరుడు వెంకటేష్తో కలిసి హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.  లింగరాజు అడ్డు తొలిగితే వచ్చే ఆస్తి, ఉద్యోగాలతో సుఖంగా జీవించాలన్న ఉద్దేశంతో అతడి భార్య మల్లేశ్వరి, ఆమె సోదరుడు వెంకటేష్ పథకం ప్రకారమే మరో ఇద్దరి సహకారంతో ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది.

ఆ రాత్రి ఏం జరిగింది ?
 లింగరాజు రోజు మాదిరిగానే  12వ తేదీ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వంట వండి ఇంటికి చేరుకున్నాడు.  అప్పటికే మద్యం తాగి  ఉన్న లింగరాజు ఇంటికి వచ్చాక మల్లీశ్వరి తో గొడవకు దిగాడు.  ఇద్దరి మధ్య కుటుంబ వ్యవహారాల పై తీవ్ర  వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. ఆ తర్వాత లింగరాజు తొమ్మిది గంటల ప్రాంతంలో మళ్లీ మద్యం తాగేందుకు బయటకు వెళ్లినట్లు తెలిసింది.

ఆత్మహత్యగా చిత్రీకరించాలని…
 అయితే, ఇదే క్రమంలో లింగరాజు భార్య మల్లేశ్వరి  ఇంట్లో గొడవ గురించి సోదరుడు వెంకటేష్ కు ఫోన్ చేసి వివరించినట్లు తెలుస్తోంది. ఇద్దరు కలిసి లింగరాజు హత్య చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.  అదే ప్రాంతానికి చెందిన మల్లీశ్వరి సోదరుడు వెంకటేష్ మరో ఇద్దరితో కలిసి లింగరాజు వద్దకు చేరుకున్నాడు.  ఆ తర్వాత ఇంటి సమీపంలోనే రైల్వే ట్రాక్ పక్కన మల్లేశ్వరి,  లింగరాజు,  వెంకటేష్,  వెంట వచ్చిన రాజు  గట్టు కు చెందిన డ్రైవర్,  హాస్టల్ లో పనిచేసే మరో వ్యక్తి సమావేశమయ్యారు. అక్కడే మద్యం తాగుతూ గొడవలు పడితే పరువు పోతుందని లింగరాజు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.అప్పటికే హత్య చేయాలని నిర్ణయించుకున్న వెంకటేష్ ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో లింగరాజు గొంతుకోశాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu