
బెంగళూరు: కర్ణాటకలోని మాండ్యలో దారుణం జరిగింది. ఓ మహిళ సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగిస్తున్నదని భర్తకు కోపం వచ్చింది. ఈ విషయమై వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్న తన భార్యకు ఎవరితోనో ఎఫైర్ ఉన్నదనే అనుమానం భర్తను కోపోద్రిక్తుడిని చేసింది. ఓ సారి ఘర్షణపడి ఆమెను చున్నీతో ఉరివేసి చంపేశాడు. ఆ తర్వాత తన మామతోనే బాధపడుతూ ఈ విషయం చెప్పాడు. ఆమె డెడ్ బాడీకి బండ కట్టి నదిలో పడేయడంలో భర్తకు ఆయన మామ కూడా సహకరించాడు.
ఈ షాకింగ్ ఘటన కొప్పలు గ్రామంలో చోటుచేసుకుంది. శ్రీనాథ్, పూజలకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి అయింది. వారికి ఒక కూతురు ఉన్నది. తన భార్య పూజ సోషల్ మీడియాలో చాలా సమయం ఖర్చు పెడుతున్నదని భర్త శ్రీనాథ్‌కు కోపంగా ఉండేది. రీల్స్, షార్ట్ వీడియోలతోనే ఆమె కాలం గడిపేది. అతేకాదు, ఆమెకు మరొకరితో ఎఫైర్ ఉన్నదనే అనుమానం కూడా శ్రీనాథ్‌ను తొలిచేసింది.
ఫోన్‌కు బానిసైపోయిన భార్య పూజతో శ్రీనాథ్ ఘర్షణపడ్డాడు. మూడు రోజుల తర్వాత మరోసారి ఇలాగే వాదనలు జరిగాయి. కోపంలో భార్య పూజను ఆమె చున్నీతోనే శ్రీనాథ్ ఉరివేసి చంపేశాడు.
Also Read: IPCకి బదులు భారతీయ న్యాయ సంహిత.. శిక్షా స్మృతులను మారుస్తూ మూడు బిల్లులు
ఆ తర్వాత శ్రీనాథ్ ఈ విషయాన్ని తన మామ శేఖర్‌తో చెప్పాడు. పూజ డెడ్ బాడీని సమీపంలోని నదిలో పడేయడంలో శేఖర్ కూడా సహకరించాడు. ఓ బైక్ పై ఆమె బాడీని వీరిద్దరూ కలిసి తీసుకెళ్లారు. ఓ పెద్ద బండరాయిని ఆమె మృతదేహానికి కట్టేసి నదిలో పడేశారు.
హత్య చేసిన కొన్ని రోజుల తర్వాత శ్రీనాథ్ నిమిషాంబ ఆలయానికి వెళ్లాడు. అక్కడే కొన్ని రోజులు ఉన్నాడు. కానీ, చివరకు శ్రీనాథ్ స్వయంగా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయాడు. ఆమె డెడ్ బాడీని డిస్పోజ్ చేయడంతో తన మామ కూడా సహకరించాడని వివరించాడు.
ప్రస్తుతం శ్రీనాథ్, శేఖర్‌లు ఇద్దరూ అరకెరే పోలీసు స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.