మిత్రుడితో మాట్లాడిందని.. భార్యను 19వ అంతస్తు నుంచి...

sivanagaprasad kodati |  
Published : Jan 02, 2019, 10:21 AM IST
మిత్రుడితో మాట్లాడిందని.. భార్యను 19వ అంతస్తు నుంచి...

సారాంశం

అనుమానంతో భార్య నిండు ప్రాణాలు తీశాడు ఓ భర్త.. మాట వరసకు స్నేహితుడితో మాట్లాడినందుకు ఆమెను అనుమానించి 19వ అంతస్తు నుంచి కిందకి తోసి చంపేశాడు.

అనుమానంతో భార్య నిండు ప్రాణాలు తీశాడు ఓ భర్త.. మాట వరసకు స్నేహితుడితో మాట్లాడినందుకు ఆమెను అనుమానించి 19వ అంతస్తు నుంచి కిందకి తోసి చంపేశాడు. వివరాల్లోకి వెళితే..చెన్న తాలంబూర్ ప్రాంతంలో 30 అంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది.

ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన సంతోష్ కుమార్ అతని భార్య బీలా దేవి సహా పలువురు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 27వ తేదీన 19క అంతస్తులో నేలను శుభ్రం చేస్తుండగా అక్కడి నుంచి కిందపడి బీలాదేవి మరణించింది.

అక్కడున్న వారంతా ప్రమాదవశాత్తూ ఆమె కిందకి పడిపోయిందని భావించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బీలాదేవీ భర్త సంతోష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపగా అసలు విషయం చెప్పాడు.

తోటి కార్మికుడితో తన భార్య నవ్వుతూ మాట్లాడటంతో అనుమానం వచ్చి, ఆమెను కిందకు తోసి హత్య చేసినట్లు సంతోష్ కుమార్ నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతనిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్