అతి శుభ్రం ప్రాణాల మీదకొచ్చింది....కడుపులోకి జారిన బ్రష్

sivanagaprasad kodati |  
Published : Jan 02, 2019, 07:37 AM IST
అతి శుభ్రం ప్రాణాల మీదకొచ్చింది....కడుపులోకి జారిన బ్రష్

సారాంశం

నోటిని శుభ్రం చేసుకునే క్రమంలో ఇద్దరు యువకులకు బ్రష్ కడుపులోకి జారిపోయింది. చివరికి వైద్యులు నానా తంటాలు పడి వాటిని బయటకు తీశారు. 

నోటిని శుభ్రం చేసుకునే క్రమంలో ఇద్దరు యువకులకు బ్రష్ కడుపులోకి జారిపోయింది. చివరికి వైద్యులు నానా తంటాలు పడి వాటిని బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన గౌరవ్, ఢిల్లీకి చెందిన అబిద్‌లు ఇటీవల కడుపునొప్పితో, ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఎయిమ్స్‌లో చేరారు.

దీంతో అక్కడి వైద్యులు వారికి సీటీ స్కాన్ చేయించి.. వారి కడుపులలో మార్చుకునే విధంగా ఉండే బ్రష్ హెడ్ ఉన్నట్లు గుర్తించారు. ఎండోస్కోపీ నిర్వహించి బ్రష్‌లను బయటకు తీసే ప్రయత్నం చేశారు. అది ఫలించకపోవడంతో హస్పిటల్‌లోని గ్యాస్ట్రో‌ఎంటరాలజీ వైద్యుల సాయం తీసుకుని ఎట్టకేలకు బ్రష్ హెడ్‌ను బయటకు తీశారు.

అనంతరం అక్కడి వైద్యులు మాట్లాడుతూ...ఆ ఇద్దరు యువకుల కడుపులో చిక్కుకున్న బ్రష్ తీయడంలో జాప్యం జరిగివుంటే మరింత ప్రమాదకరంగా మారేదన్నారు... ఇన్ఫెక్షన్ సోకి వారి ప్రాణాలు పోయేవన్నారు. ప్రస్తుతం బాధితులు ఎయిమ్స్‌లోనే కోరుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?