అనుమానంతో భార్యను హత్య చేసి, మృతదేహాన్ని అత్తగారింటిముందు పడేసి.. ఓ భర్త దారుణం..

By SumaBala BukkaFirst Published Sep 28, 2022, 11:06 AM IST
Highlights

అనుమానంతో భార్యను హత్యచేశాడో భర్త. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని తీసుకువెళ్లి అత్తగారింటిముందు వేసి పారిపోయాడు. 

బెంగళూరు : అనుమానం పెనుభూతమవుతోంది. అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. జీవితాంతం కలిసి ప్రయాణం చేయాల్సిన భార్యభర్తల మధ్య చిచ్చుపెడుతోంది. చివరికి ఒకరిని దూరం చేసి.. మరొకరనికి నేరస్తుల్ని చేస్తుంది. మనసులు కలువక పోతే.. కాపురాలు తెగతెంపులు చేసుకోవచ్చు.. కానీ ప్రాణాలు తీస్తున్నారు. ఎప్పటికైనా దొరికిపోతామనే విషయం మరిచి క్షణికావేశంలో నేరస్తులుగా మారుతున్నారు. 

అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్యను అనుమానించి.. చివరికి హత్య చేసిన ఘటన సోమవారం రాత్రి హగరి బొమ్మనహళ్లి తాలూకా బ్యాసగదేరి గ్రామంలో జరిగింది. విజయనగరం జిల్లా ఎస్పీ డాక్టర్ అరుణ్ తెలిపిన వివరాల ప్రకారం..బ్యాసగదేరి నివాసి రవికుమార్ (32)కు తన బంధువు దీపా (21)తో దాదాపు ఏడాదిన్నర క్రితం పెళ్లయింది. అప్పటినుంచి భార్యపై అనుమానంతో నిత్యం గొడవ పడుతూ ఉండేవాడు. 

తాగుబోతు భర్త ఘాతుకం.. భార్య జననావయవంపై వేడి కత్తితో కాల్చి, అసహజ శృంగారం..

ఈ క్రమంలో సోమవారం రాత్రి గొంతునులిమి హత్య చేశాడని తెలిపారు. హత్య చేసిన అనంతరం అదే గ్రామంలో నివాసం ఉంటున్న తన అత్తమామల ఇంటివద్దకు మృతదేహాన్ని తీసుకు వెళ్లి.. మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లాడని తెలిపారు.  మృతురాలి తల్లి గౌరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని రవికుమార్ తో పాటు అతని తండ్రి షణ్ముఖప్ప, తల్లి జయమ్మ, అక్క శిల్ప, చెల్లెలు సుజాతలను అదుపులోకి తీసుకుని  కస్టడీకి అప్పగించిన్నట్లు తెలిపారు. 

ఇదిలా ఉండగా, తన భార్య మరొక వ్యక్తితో సహజీవనం చేస్తోందంటూ కక్ష పెంచుకున్న భర్త బతుకమ్మ ఆడుతున్న ఆమెను దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి సిద్దిపేట జిల్లా వీరాపూర్ లో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం..  గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ, గోపాల్ రెడ్డి  దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా పెద్దకూతురు మంగను స్థానికుడైన ఎల్లారెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. నెలరోజులకే మంగ ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని చనిపోవడంతో మరల రెండో కుమార్తె స్వప్నను ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. 

ఆరేళ్ల వరకు వీరి కాపురం సజావుగానే జరిగింది. తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు మొదలయ్యాయి. స్వప్న ఇదే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తితో 14 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. దీంతో ఎల్లారెడ్డి పలుమార్లు ఆమెతో గొడవకు దిగి చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తోటి మహిళలతో బతుకమ్మ ఆడుతుండగా... ఆమె తలపై ఎల్లారెడ్డి ఇనుపరాడ్ తో బలంగా మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై స్వప్న అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్ఐ తిరుపతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. 

click me!