ముగ్గురు పిల్లల్ని, భర్తను వదిలేసి ప్రియుడితో భార్య జంప్.. వీడియో కాల్స్ చేసి హింస, తట్టుకోలేక భర్త చేసిన పని

By Bukka SumabalaFirst Published Aug 19, 2022, 8:09 AM IST
Highlights

వివాహేతర సంబంధం పెట్టుకుని భర్త, పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయిన భార్య.. ఆ తరువాత వీడియో కాల్స్ చేస్తూ పెట్టే హింస భరించలేక భర్త... తన ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. 

కర్ణాటక : భర్త ముగ్గురు పిల్లలను వదిలి ప్రియుడితో కలిసి దుబాయ్ కి వెళ్ళిపోయింది ఓ మహిళ.  అంతటితో వారిని వదిలేస్తే సమస్య ఉండకపోయేది. కానీ ఆ మహిళ పిల్లలకు తరచుగా ఫోన్ కాల్ చేస్తూ  ఆట పట్టిస్తుండేది, భర్తను, పిల్లలను ఎద్దేవా చేస్తుండేది. ఈ మానసిక హింస తట్టుకోలేక ఆ భర్త..  ముగ్గురు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

వీడియో కాల్ చేస్తూ…
కర్ణాటక, తుమకూరులోని పీహెచ్ కాలనీలో amiullah(42) భార్య సహెరా భాను, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. నాలుగేళ్ల కిందట సాహెబ్ ప్రియుడితో కలిసి దుబాయ్ కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి సమీవుల్లా ఒక్కడే ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకును పోషించుకుంటూ జీవిస్తున్నాడు. మరోవైపు సాహెరా బాను దుబాయ్ నుంచి తన పిల్లలకు వీడియో కాల్స్ చేస్తుండేది. ఆ కాల్స్ లో హేళనగా మాట్లాడుతుండేది. ఈ పరిణామాలతో విరక్తి చెందిన సమీవుల్లా గురువారం ఉదయం పిల్లలకు పురుగుల మందు తాగించాడు. 

ఆ తరువాత తాను కూడా తాగాడు. కొంతసేపటికే సమీవుల్లా చనిపోయాడు. పిల్లలు ప్రాణాలతో కొట్టుమిట్టాడడం చూసిన ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. వారు అంబులెన్స్లో బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది.

మహారాష్ట్ర సర్కార్ మెలిక... ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన వాయిదా

ఇదిలా ఉండగా, విశాఖ పెందుర్తిలో కలకలం రేపిన వరుస హత్యల్లోనూ ఇదే విషయం ఉంది. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్య వివాహేతర సంబంధాన్ని చూసి..  అతను తట్టుకోలేకపోయాడు.. దీంతో ఆడవాళ్ళంటేనే అసహ్యం పెంచుకున్నాడు. కుటుంబానికి పూర్తిగా దూరమైపోయాడు. సైకో గా మారాడు. ఆడవాళ్లే లక్ష్యంగా హత్యలకు తెగబడ్డాడు. విశాఖ జిల్లా పెందుర్తిలో కలకలం రేపిన వరుస హత్యల నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ ఈ మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. అవి ఇలా ఉన్నాయి…

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన చందక రాంబాబు (49) భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2006లో కుటుంబంతో సహా హైదరాబాద్కు వెళ్లి రియల్ ఎస్టేట్ లో పని చేసేవాడు. అక్కడ  బిల్డర్ మోసం చేశాడు. ఆ తర్వాత కుటుంబాన్ని అక్కడే ఉంచి, కొన్నాళ్ళు విశాఖలో ఉన్నాడు. 2016లో ఓ సారి హైదరాబాద్ కు వెళ్ళినపుడు భార్య ప్రవర్తన చూసి, నచ్చక  ఆమెకు విడాకులు ఇచ్చాడు. పిల్లలు సైతం రాంబాబును దూరం పెట్టారు. పెందుర్తిలో అద్దెఇంట్లో ఉండగా..  అతని ప్రవర్తన చూసి, నచ్చక ఇంటి యజమాని ఖాళీ చేయించాడు.

ఈ క్రమంలోనే భార్యపై కోపంతో రాంబాబు మహిళా ద్వేషిగా మారాడు. అపార్ట్మెంట్ల నిర్మాణం వద్ద మహిళలు కుటుంబాలతో సహా కాపలాగా ఉంటారని అవగాహనతో వారినూ లక్ష్యంగా చేసుకున్నాడు. కిలో బరువున్న ఇనుపరాడ్ కొని, పట్టుకోవడానికి వీలుగా దానికి రంధ్రం చేసి, తాడు కట్టాడు రెండు చొక్కాలు వేసుకుని, వాటి మధ్యలో రాడ్ దాస్తుండేవాడు. జూలై 9న రాత్రి పెందుర్తి బృందావన్ గార్డెన్స్ లో అపార్ట్మెంట్ కాపలాదారు టి. నల్లమ్మపై దాడి చేశాడు. ఆమె గాయాలపాలయ్యింది. ఆగస్టు 8న చిన్నముసిడివాడలో అపార్ట్మెంట్ కాపలాదారులుగా ఉన్న ఎస్ అప్పారావు (72), లక్ష్మి(62)లను రాడ్ తో కొట్టి చంపాడు. 

ఆగస్టు14న సుజాతనగర్ నాగమల్లి లేఅవుట్ లో వాచ్మెన్ ఎ. లక్ష్మిని హత్య చేశాడు. ఒకే తరహాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. లక్ష్మి హత్య తర్వాత పోలీసులు వెంటనే రారులే అనుకుని రాంబాబు అదే ప్రాంతంలో తిరుగుతూ ఉండగా పోలీసులు అనుమానంతో ఆరా తీశారు. దీంతో వాస్తవాలు వెలుగు చూశాయి. 

click me!