భ‌ర్త శారీరక శ్రమ చేసి అయినా విడిపోయిన భార్య‌, బిడ్డ‌ల‌కు భ‌ర‌ణం చెల్లించాల్సిందే - సుప్రీంకోర్టు

By team teluguFirst Published Oct 6, 2022, 2:19 PM IST
Highlights

విడిపోయిన భార్యకు, కుమారులకు భర్త కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించి అయినా భరణం చెల్లించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వారి బాధ్యత భర్తపై కచ్చితంగా ఉంటుందని తెలిపింది. 

భ‌ర్త శారీర‌కంగా క‌ష్ట‌ప‌డి డ‌బ్బులు సంపాదించి అయినా విడిపోయిన భార్య, వారి మైనర్ పిల్లలకు భ‌ర‌ణం చెల్లించాల్సిందేన‌ని సుప్రీంకోర్టు తెలిపింది. శారీరకంగా కుదరకపోతే మాత్రమే అతడికి న్యాయపరమైన కారణాలతో భ‌ర‌ణం నుంచి మినహాయింపు ఇవ్వవచ్చని పేర్కొంది. భార్య, పిల్లలు, తల్లిదండ్రుల నిర్వహణకు సంబంధించిన సీఆర్‌పీసీలోని సెక్షన్ 125 వెన‌క ఉన్న ఉద్దేశాన్ని ఈ సంద‌ర్భంగా నొక్కి చెప్పింది. ఈ మేర‌కు న్యాయమూర్తులు దినేష్ మహేశ్వరి, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.

దసరా వేడుకలు.. రావణుడికి నిప్పు.. రివర్స్ ఫైరింగ్ చేసిన అసురుడు (వీడియో)

భార్య, మైనర్ పిల్లలకు ఆర్థిక సహాయం చేయడం భర్త పవిత్ర కర్తవ్యమ‌ని కోర్టు తెలిపింది. విడిపోయిన భార్య పాత్రను ప్రశ్నిస్తూ తన కొడుకు డీఎన్‌ఏ పరీక్షను కోరిన వ్యక్తి నెలకు రూ.10,000 భత్యం చెల్లించాలని ధ‌ర్మాస‌సం ఆదేశించింది. అలాగే మైన‌ర్ కుమారుడికి నెలకు రూ.6,000 భరణం చెల్లించాలని తెలిపింది. 

నా కోసం సీఎం కుర్చీని వ‌దులుకున్నా.. నితీష్ కుమార్ కోసం ప‌నిచేయ‌ను: ప్ర‌శాంత్ కిషోర్

2010లో ఓ మహిళ తన భర్త నుంచి విడిపోయింది. తన భర్త నుంచి పవిత్రమైన విధి అయిన పోషణ కోసం ఆమె సుధీర్ఘ న్యాయ పోరాటం చేస్తోంది. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరుకున్న నేపథ్యంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఎన్నికల చట్టాల్లో మార్పులు ఇప్పుడు అవ‌స‌రం - కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు

‘‘ ప్రతివాది (భర్త) సమర్ధుడు. ఆయ‌న చ‌ట్ట‌బద్ధమైన మార్గాల ద్వారా డ‌బ్బులు సంపాదించి భార్య‌, బిడ్డ‌ల పోష‌ణను చూసుకోవాల్సిన బాధ్య‌త ఉంది. కుటుంబ న్యాయస్థానం ముందు అప్పీలుదారు (భార్య) అందించిన  సాక్ష్యాధారాలు, రికార్డులో ఉన్న ఇతర సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న త‌రువాత ప్రతివాది తగినంత ఆదాయ వనరులు కలిగి ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ భ‌ర‌ణం అందించే విష‌యంలో విఫ‌లం అయ్యాడు. ఈ విస‌యంలో కోర్టుకు ఎలాంటి సందేహ‌మూ లేదు. అప్పీలుదారుని మెయింటెన్ చేయ‌డంలో ప్ర‌తిపాది నిర్ల్యక్షంగా ఉన్నాడు. ’’ అని కోర్టు తెలిపింది. 
 

click me!