అదనపు కట్నం వేధింపులు.. భార్య కాలివేళ్లను కటింగ్ ప్లేయర్ తో కత్తిరించిన భర్త..

Published : Sep 09, 2022, 08:25 AM IST
అదనపు కట్నం వేధింపులు.. భార్య కాలివేళ్లను కటింగ్ ప్లేయర్ తో కత్తిరించిన భర్త..

సారాంశం

అదనపు కట్నం కావాలని ఓ భర్త దారుణానికి తెగబడ్డాడు. భార్య కాలివేళ్లను కటింగ్ ప్లేయర్ తో కట్ చేసి పైశాచికత్వాన్ని చూపించాడు.

హర్యానా : వరకట్నం ఇవ్వడం.. తీసుకోవడం చట్టరీత్యా నేరం.. కానీ ఎక్కడా ఇది ఆగడం లేదు. ఏదో ఒక రూపంలో ఇవ్వడం, తీసుకోవడం జరుగుతూనే ఉంది. వధువు, వరుడి కుటుంబాలకు పెద్దగా కష్టం, నష్టం లేనంతవరకు ఇది ఏమంత పెద్ద విషయంగా కనిపించదు. కానీ కట్నదాహంతో భార్యలను, కోడళ్లను చిత్రహింసలు పెట్టినప్పుడు ఇది మళ్లీ తెరమీదికి వస్తుంది. అలాంటి ఓ ఘటనే ఇప్పుడు వరకట్నం మీద మళ్లీ మాట్లాడుకునేలా చేస్తోంది. 

అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధిస్తున్న ఓ భర్త.. ఆమె కాలివేళ్ళను కటింగ్ ప్లేయర్ తో కత్తిరించాడు. ఈ దారుణ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగింది. నగరానికి చెందిన మహిళలకు 13 ఏళ్ల క్రితం రాజేష్ తో వివాహం జరిగింది. కొన్ని రోజులు బాగానే ఉన్న భర్త ఆ తర్వాత వేధింపులు మొదలుపెట్టాడు. రూ.4లక్షల అదనపు కట్నం తేవాలంటూ బాధితురాలి భర్త సహా.. అతడి తండ్రి, సోదరుడు ఆమెను తీవ్రంగా కొట్టేవారు. 

ఆమె ఓ లేడీ అర్జున్ రెడ్డి.. ఫుల్లుగా మందేసి వచ్చి స్కూల్ పిల్లలకు పాఠాలు.. టీచర్ సస్పెండ్...

ఎంత చెప్పినా ససేమిరా అనడంతో ఆగ్రహించిన రాజేష్ ఆమె కాలివేళ్ళను కత్తిరించాడు. బాధతో విలవిలలాడింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయగా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి రక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు ఫిర్యాదు మేరకు ఆమె భర్త మామ, మరిది కింద కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 8న ఇలాంటి ఘటనే  కర్ణాటకలోని  బసశంకరిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన 28 ఏళ్ల బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రైవేటు కంపెనీ ఉద్యోగి సుదీప్ మీద బెంగళూరు బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ యువతికి-సుదీప్ కు 2021లో పెళ్లి జరిగింది. వరుని కుటుంబం డిమాండ్ మేరకు వధువు కుటుంబీకులు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వైభవోపేతంగా పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో రూ. 55 లక్షల విలువచేసే మినీ కూపర్ కారు, 200 కిలోల వెండి, 4 కిలోల బంగారు ఆభరణాలను సుదీప్ కు ముట్ట చెప్పారు. 

కట్నం, పెళ్లి ఖర్చులు కలిపి రూ. 6 కోట్లు అయినట్లు తెలిపింది. అయితే, ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసి ఇన్ని కట్నకానుకలు ఇచ్చినా అతడిలో అసంతృప్తి తగ్గలేదు.పెళ్ళైన కొద్ది రోజులకే.. వీటితో సంతృప్తి చెందని భర్త సుదీప్, పుట్టింటి నుంచి మరింత డబ్బు తేవాలని భార్యను వేధించాడు. దీంతో యువతి తండ్రి తమ రెండు కంపెనీలను అల్లుని పేరిట రాశారు. ఆ కంపెనీలో వచ్చే లాభం సుదీప్ తీసుకునేవాడు. ఈ క్రమంలో సుదీప్ డ్రగ్స్ కు బానిస అయ్యాడు. 

స్నేహితులను ఇంటికి పిలిపించుకుని డ్రగ్స్ తీసుకునేవాడు. ఆ మత్తులో భార్య తలపై మూత్ర విసర్జన చేసి వికృతంగా ప్రవర్తించేవాడు. దీనిని ప్రశ్నిస్తే భార్యను అసభ్యంగా దూషించేవాడు. ఈ విషయాన్ని ఆమె అత్తమామలకు చెప్పుకోగా.. వారు కొడుకునే వెనకేసుకొచ్చారు. పైగా నిన్నే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్