చింతామణిలో ఘోరం... భార్యను లారీకింద తోసిచంపిన కసాయి భర్త

Published : Dec 04, 2022, 08:49 AM IST
చింతామణిలో ఘోరం... భార్యను లారీకింద తోసిచంపిన కసాయి భర్త

సారాంశం

కలకాలం తోడుగా వుంటూ కాపాడతాడని పెళ్లాడి వెంటవచ్చని భార్యను లారీ కింద తోసేసిన కసాయి భర్త అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ అమానుషం కర్ణాటకలోని కొలార్ జిల్లాలో చోటుచేసుకుంది. 

కొలార్ జిల్లా : జీవితాంతం తోడుంటానని ప్రమాణంచేసి పెళ్లాడినవాడే ఆమెను పొట్టనపెట్టుకున్నాడు. మద్యంమత్తులో విచక్షణ కోల్పోయిన భర్త కట్టుకున్న భార్యతో అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే భార్యను లారీకింద తోసేసి చంపాడో కసాయి భర్త. ఇలా చిత్తూరుకు చెందిన వివాహిత భర్తచేతిలో అతి దారుణంగా హత్యకు గురయ్యింది. ఈ దారుణం  కర్ణాటకలో చోటుచేసుకుంది. 

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కేదేపల్లి గ్రామానికి చెందిన సుమేరా సుల్తానా (38)కు కర్ణాటకకు చెందిన మునికృష్ణప్ప భార్యాభర్తలు. వీరికి బాబాజాన్(10) సంతానం. దంపతులిద్దరు కూలీపనులు చేసుకుంటూ జీవించేవారు. హాయిగా సాగుతున్న వీరి జీవితంలో మద్యం చిచ్చు పెట్టింది. 

Read More కర్నూల్ లో దారుణం... ప్రియుడి చేతిలో మోసపోయి గర్భిణి వివాహిత ఆత్మహత్య

మునికృష్ణప్ప మద్యానికి బానిసై మత్తులో విచక్షణ కోల్పోయి నిత్యం భార్యతో గొడవపడేవాడు. అయితే తాజాగా పని వుండటంతో కొలార్ జిల్లా చింతామణి పట్టణానికి బిడ్డను తీసుకుని వెళ్లారు మునికృష్ణప్ప-సుల్తానా దంపతులు. ఇక్కడ కూడా ఫుల్లుగా మద్యంసేవించి మునికృష్ణప్ప నడిరోడ్డుపైనే భార్యతో గొడవకు దిగాడు. మద్యంమత్తులో వున్న అతడు రోడ్డుపై వేగంగా వెళుతున్న లారీకిందకు భార్యను తోసేసాడు. లారీ చక్రాలు ఆమె తలపైనుండి వెళ్లనంతో చిట్లిపోయి అక్కడికక్కడే మరణించింది.  

ఈ దారుణాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా అక్కడికి చేరుకుని మునికృష్ణప్పను అదుపులోకి తీసుకున్నారు. సుల్తానా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇలా తల్లి మృతి, తండ్రి జైలుకు వెళ్లడంతో పదేళ్ల చిన్నారి అనాధగా మారింది. 
 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !