భారత్ జోడో యాత్రలో పాల్గొన్న స్కూల్ టీచర్‌పై సస్పెన్షన్ వేటు

By Mahesh RajamoniFirst Published Dec 4, 2022, 5:58 AM IST
Highlights

Bhopal: భార‌త్ జోడో యాత్ర‌లో పాలుపంచుకున్న ఓ ఉపాధ్యాయుడిని స‌స్పెండ్ కు గుర‌య్యారు. కాగా, సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుండి కాంగ్రెస్ దేశవ్యాప్త భార‌త్ జోడో యాత్ర ప్రారంభించబడింది.

Bhopal: భార‌త్ జోడో యాత్ర‌లో పాలుపంచుకున్న ఓ ఉపాధ్యాయుడు స‌స్పెండ్ కు గుర‌య్యారు. కాగా, సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుండి కాంగ్రెస్ దేశవ్యాప్త భార‌త్ జోడో యాత్ర ప్రారంభించబడింది. అప్పటి నుండి దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్రలో రాహుల్ గాంధీ పాద‌యాత్ర‌ను ముగించుకుని ప్ర‌స్తుతం మధ్యప్రదేశ్ మీదుగా ముందుకు సాగుతోంది. 

వివరాల్లోకెళ్తే.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు హాజరైనందుకు మధ్యప్రదేశ్‌లోని ఓ పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు . రాష్ట్రంలోని కనస్య జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు రాజేష్ కన్నోజే పేర్కొనబడని కీల‌క‌మైన‌ పనిని పేర్కొంటూ సెలవు కోరాడు, అయితే యాత్రలో అతని ఫోటోగ్రాఫ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత తెలిసింది అత‌ను భార‌త్ జోడో యాత్ర‌లో పాలుపంచుకున్నార‌ని తెలిసింది. 

వృత్తిపరమైన ప్రవర్తనను నియంత్రించే నిబంధనలను ఉల్లంఘించి, రాజకీయ సమావేశాలకు వెళ్లినందుకు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల విభాగంలో అధ్యాపకుడు కనోజేను సస్పెండ్ చేశారు. నవంబర్ 25న‌ న సస్పెన్షన్ ప్రారంభమైంది. అయితే, సోషల్ మీడియాలో ఆర్డర్ కనిపించిన తరువాత మాత్రమే వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర కాంగ్రెస్ 'కాశ్మీర్ టు కన్యాకుమారి' యాత్ర వ‌ర‌కు సాగ‌నుండ‌గా, నవంబర్ 23న మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. శ‌నివారం ఉదయం మహుదియా గ్రామం నుండి తన పాదయాత్రను పునఃప్రారంభించారు రాహుల్ గాంధీతో ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు కమల్ నాథ్, నామ్‌దేవ్ దాస్ త్యాగిలు క‌లిసి ముందుకు న‌డిచారు. అలాగే, ప్రముఖ సంగీత స్వరకర్త టీఎం.కృష్ణ కూడా పాల్గొంటారని పీటీఐ నివేదించింది. 

కాగా, సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుండి కాంగ్రెస్ దేశవ్యాప్త భార‌త్ జోడో యాత్ర ప్రారంభించబడింది. అప్పటి నుండి దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్రలో రాహుల్ గాంధీ పాద‌యాత్ర‌ను ముగించుకుని ప్ర‌స్తుతం మధ్యప్రదేశ్ మీదుగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4న రాజస్థాన్‌లోకి ప్రవేశించే ముందు 12 రోజుల్లో పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని మాల్వా-నిమార్ ప్రాంతంలో 380 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ  పాదయాత్ర సాగనుంది.

 

जो बांटने की बात करे वो बंधन तोड़ना है,
हम सभी को मिलकर भारत जोड़ना है!

आज भारत जोड़ो यात्रा में कर्नाटक शैली के प्रशिक्षित गायक और रेमन मैग्सेसे पुरस्कार विजेता टी. एम. कृष्णा जी का साथ मिला। pic.twitter.com/B4ySbAoMUw

— Bharat Jodo (@bharatjodo)

 

आशा वर्करों ने कोरोना काल में अपनी जान हथेली पर रख कर काम किया, लेकिन बदले में उन्हें मिला क्या? न वेतन वृद्धि न भत्ते। आप भी सुनिए उनकी पीड़ा। pic.twitter.com/CXWWBwYCEH

— Bharat Jodo (@bharatjodo)

 

click me!