స్పృహతప్పిన భార్యను సజీవదహనం చేసిన భర్త..

Published : Jun 10, 2022, 12:41 PM IST
స్పృహతప్పిన భార్యను సజీవదహనం చేసిన భర్త..

సారాంశం

భార్య తలమీద కొట్టి.. ఆమె స్పృహతప్పగానే కట్టెలు వేసి, మంటపెట్టి సజీవదహనం చేశాడో కిరాతక భర్త.. ఈ ఘటన ముంబైలోని భీవండిలో కలకలం రేపింది. 

ముంబై : స్పృహ తప్పిన భార్యను బతికుండగానే తగలబెట్టాడు ఓ భర్త. ఈ దారుణమైన సంఘటన bhiwandi స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంతోష్ చౌరాసియా తన భార్య కవిత, ఇద్దరు పిల్లలతో కలిసి కేంద్రంలోని మహాంకాళి దాబా పక్కనే ఉన్న గుడిసెల్లో నివసిస్తున్నారు. కూలీ పనిచేసే సంతోష్ వ్యసనాల కారణంగా పనికిపోక తరచుగా భార్యతో గొడవ పడేవాడు.

మంగళవారం మద్యం సేవించిన సంతోష్ భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆవేశంతో సంతోష్ కవిత తలపై కర్రతో కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దీంతో గుడిసె బయట నిల్వచేసిన కర్రలకుప్ప దగ్గరకు కవితను లాక్కొచ్చి ప్రాణంతో ఉన్న కవితపై కట్టెలు పేర్చి.. నిప్పు అంటించి.. హత్య చేసి పారిపోయాడు.  పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

ఇదిలా ఉండగా, మార్చి 30న ఇలాంటి ఘటనే తమిళనాడులో వెలుగు చూసింది. బతికుండగానే భార్యను పూడ్చి పెట్టాడు ఓ కిరాతక భర్త. ఈ దారుణ ఉదంతానికి సంబంధించి నిందితుడుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం..  తమిళనాడు వేలూరు సమీపంలోని కాట్పాడి వడుకన్ తాంగల్ కు చెందిన వినాయకం.. ప్రైవేటు ఉద్యోగి. గుడియాత్తం నివాసి సుప్రజను (25) ప్రేమించి నాలుగేళ్ల కిందట పెళ్ళాడాడు. దంపతులు కేవీ కుప్పం సమీపంలోని మడినాంపట్టులో నివాసముంటున్నారు. వారికి ఏడాదిన్నర పాప కూడా ఉంది. 2 నెలల క్రితం సుప్రజ అనారోగ్యానికి గురయ్యింది. అప్పుడు భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. భార్యను వినాయకం  తీవ్రంగా కొట్టడంతో  ఆమె స్పృహ కోల్పోయింది.  

అయితే, ఆమె చనిపోయిందని భావించిన వినాయకం వెంటనే తన తమ్ముడు విజయ్, స్నేహితుడు శివకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించాడు. శుక్రవారం అర్ధరాత్రి కవసంబట్టు చక్కెర తోపు అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సజీవంగా పాతిపెట్టారు. సుప్రజ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ సెంథిల్ కుమారి కేసు నమోదు చేశారు.  నిందితులను మంగళవారం అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. సుప్రజ మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు చర్యలు చేపట్టారు.

మరో ఘటనలో.. ఫిబ్రవరి 3న భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన భర్త పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయిన ఘటన ఢిల్లీiలో చోటు చేసుకుంది. తుగ్లకాబాద్ ఎక్స్ టెన్షన్ ప్రాంతానికి చెందిన ఓ భర్త ఘటన జరిగిన రోజు ఉదయం ఢిల్లీలోని గోవింద్ పురి పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. తన భార్యను కత్తెరతో పొడిచి చంపానని చెప్పి భర్త పోలీసుల ముందు లొంగిపోయాడు. తాను ఇంట్లో ఉన్న ప్రెజర్ కుక్కర్, సిలిండర్, కత్తెరతో భార్యను చంపానని నిందితుడైన భర్త పోలీసులకు చెప్పాడు. 

పోలీసులు భార్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కత్తెర, కుక్కర్, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. భార్య దారుణ హత్య ఘటన మీద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?