ముగ్గురు పిల్లలతో సహా భార్యభర్తలు ఆత్మహత్య ?.. గత వారమే వివాహం.. అంతలోనే విషాదం...

Published : May 24, 2023, 12:39 PM IST
ముగ్గురు పిల్లలతో సహా భార్యభర్తలు ఆత్మహత్య ?.. గత వారమే వివాహం.. అంతలోనే విషాదం...

సారాంశం

కేరళలోని కన్నూర్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ దంపతులు తమ ముగ్గురు పిల్లలకు ఉరివేసి, తాము ఆత్మహత్య చేసుకున్నారు. కాగా వారికి ఇది రెండో వివాహం. గత వారమే వారు వివాహం చేసుకున్నారు. 

కన్నూర్ : కన్నూర్‌లోని చెరుపుజాలోని ఓ ఇంట్లో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు శవమై కనిపించారు. ఈ ఘటన చెరుపుజ పాటిచల్‌లో చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటనలో షాజీ-శ్రీజ అనే దంపతులు, వారి పిల్లలు శవమై కనిపించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, ఇది హత్య-ఆత్మహత్య కేసుగా తెలుస్తోందన్నారు. 

పిల్లలను చంపిన తర్వాత ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు తెలిపారు. చిన్నారులు సూరజ్ (12), సుజిన్ (10), సురభి (8) మృతి చెందారు. రెండు వారాల క్రితం శ్రీజ, షాజీ పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం గత 16న జరిగింది. చిన్నారులు మెట్లపై ఉరివేసుకుని మృతి చెందారు. శ్రీజ మొదటి పెళ్లి ద్వారా కలిగిన పిల్లలు ముగ్గురు చనిపోయారు. కాగా, షాజీకి మరో భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఒకే కాన్పులో ఐదుగురు ఆడపిల్లలు.. నార్మల్ డెలివరీ చేసిన వైద్యులు..

కేరళలోని కన్నూర్ జిల్లా చెరుపుజలో ఉన్న తమింట్లో ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బుధవారం ఉదయం శవాలై కనిపించడం కలకలం రేపింది. ప్రాథమిక విచారణ ప్రకారం, గత వారం వివాహం చేసుకున్న జంట పిల్లలను చంపి, ఆపై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

పిల్లలు మెట్లకు, దంపతులు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లకు వేలాడుతూ కనిపించారు. ఈ ఘటన మంగళవారం అర్థరాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ రోజు ఉదయం ఈ సంఘటన వెలుగు చూడడంతో ఆ ప్రాంత వాసులు పోలీసులను అప్రమత్తం చేశారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !