
ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఓ వ్యక్తి కూడా రూ.25లక్షలు విలువచేసే స్విమ్మింగ్ పూల్ నిర్మించాడు. కానీ అందులో గేదెలు జలకాలాటలు ఆడటం విశేషం. దారితప్పిన ఓ గేదెల మంద స్విమ్మింగ్ పూల్ ని ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
18 గేదెలు సమీపంలోని పొలం నుండి తప్పించుకుని ఎసెక్స్ స్విమ్మింగ్ పూల్‌లో ఉదయం స్నానం చేశాయి. గేదెలు అందులో దిగడం వల్ల దాదాపు రూ.25లక్షల నషట్ం వాటిల్లడం విశేషం.
పూల్ లోకి దిగి నీటిని పాడు చేయడమే కాకుండా, పూల్ చుట్టూ ఉన్న ఫెన్సింగ్, పూల పడకలను నాశనం చేశాయి. మొత్తం తొక్కి నాశనం చేసేశాయి. గమనించిన స్థానికులు ఆ గేదెలను క్షేమగా బయటకు తీసి, యజమానికి అప్పగించారు. గత సంవత్సరం జూలైలో ఈ సంఘటన జరగడం విశేషం.
"నా భార్య ఉదయం టీ చేయడానికి వెళ్ళినప్పుడు, ఆమె వంటగది కిటికీలోంచి బయటకు చూడగా, కొలనులో ఎనిమిది గేదెలను కనిపించాయి" అని పూల్ యజమాని చెప్పడం విశేషం. వెంటనే ఆమె ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసింది. వారు వచ్చి వెంటనే వారు వచ్చి క్షేమంగా వాటిని బయటకు తీశారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ గా మారింది.