భార్య ఎదుటే మరో మహిళపై అత్యాచారం.. సపోర్ట్ చేసిన భార్య.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్.. చివరకు ఏమైందంటే..

By Sumanth KanukulaFirst Published Jan 23, 2022, 4:08 PM IST
Highlights

ఓ వ్యక్తి తన భార్య ఎదుటే మరో మహిళపై అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను అతడి భార్య రికార్డు చేసింది. ఆ తర్వాత భార్యభర్తలు ఇద్దరు కలిసి బాధిత మహిళను blackmail చేశారు. అత్యాచార సమయంలో తీసిన వీడియోలను లీక్ చేస్తామని చెప్పి.. భారీగా డబ్బులు వసూలు చేశారు. 

ఓ వ్యక్తి తన భార్య ఎదుటే మరో మహిళపై అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను అతడి భార్య రికార్డు చేసింది. ఆ తర్వాత భార్యభర్తలు ఇద్దరు కలిసి బాధిత మహిళను blackmail చేశారు. అత్యాచార సమయంలో తీసిన వీడియోలను లీక్ చేస్తామని చెప్పి.. భారీగా డబ్బులు వసూలు చేశారు. అంతేకాకుండా ఆ వీడియోలతో బెదిరించి బాధిత మహిళపై పలుమార్లు అత్యాచారం చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మహారాష్ట్రలో Mumbaiలో నివాసం ఉంటున్న సయ్యద్ యూసుఫ్ జమాల్, అతని భార్య నాజ్ సయ్యద్ తనపై ఓ మహిళ Nagpara police station‌లో ఫిర్యాదు చేసింది. 

యూసుఫ్ అతని భార్య ఎదుటే తనపై అత్యాచారం చేసేవాడని బాధిత మహిళ తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియను యూసఫ్ భార్య నాజ్ వీడియో తీసేదని పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియో ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తామని బెదిరింపుకు పాల్పడిందని చెప్పింది. ఇలా తనను బ్లాక్ ‌మెయిల్ చేసి దాదాపు కోటి రూపాయలకు పైగా తీసుకున్నారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. వారు కొన్ని కొన్ని బ్లాక్‌ మ్యాజిక్‌లు చేసేవారని ఆరోపించింది. 

ఈ క్రమంలోనే పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అయితే మహిళ పోలీసులకు ఫిర్యదు చేసిందని తెలుసుకు్న నిందితులు ముంబై నుంచి పారిపోయారు. అయితే వారు కోలకత్తాలో ఉన్న విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు.. స్థానిక పోలీసుల సహాయం తీసుకన్నారు. ముంబై, కోల్‌కత్తా పోలీసులు సంయుక్తంగా కోల్‌కతాలోని న్యూ మార్కెట్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఉన్న యూసుఫ్‌, నాజ్‌లను అరెస్ట్ చేశారు. వారిని సిటీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ముంబై పోలీసులు ట్రాన్సిట్ వారెంట్‌పై నిందితులను ముంబైకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళపై తొలిసారిగా 2015‌లో అత్యాచారం జరిగింది. అప్పటి నుంచి బెదిరింపులు కొనసాగుతున్నాయి. అయితే బాధిత మహిళ కూతురి చేత అదే పని చేయించాలని యూసుఫ్ దంపతులు భావించారు. దీంతో ఆ మహిళ తన మౌనం వీడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులు ముంబై నుంచి పారిపోయి కోల్‌కత్తాలోని న్యూ మార్కెట్ ప్రాంతంలో దాక్కున్నారు. వారిని పోలీసులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. 

click me!