తమిళనాడులో నరబలి కలకలం.. భార్య, కూతురు ఆత్మశాంతికోసం రెండేళ్ళ చిన్నారిని బలివ్వబోయిన దుర్మార్గుడు..

Published : Feb 07, 2023, 12:07 PM ISTUpdated : Feb 07, 2023, 12:08 PM IST
తమిళనాడులో నరబలి కలకలం.. భార్య, కూతురు ఆత్మశాంతికోసం రెండేళ్ళ చిన్నారిని బలివ్వబోయిన దుర్మార్గుడు..

సారాంశం

తమిళనాడులో ఓ వ్యక్తి తన భార్య, కూతురు ఆత్మశాంతికోసం రెండేళ్ల చిన్నారిని బలివ్వాలనుకున్నాడు. దీనికోసం ఇంటిముందు ఆడుకుంటున్న పసిపాపను ఎత్తుకొచ్చాడు. కానీ..

తమిళనాడు : మూఢనమ్మకాలు ఓ రెండేళ్ల పసిపాప ప్రాణాలు తీయబోయాయి. రెండేళ్ల పసిపాపను బలి చేయడం ద్వారా తన భార్య, కూతురు ఆత్మలు శాంతింపచేయాలనుకున్నాడో దుర్మార్గుడు. దీనికోసం ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి బలి ఇవ్వాలని చూశాడు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. నరబలితో ఆత్మలు శాంతిస్తాయన్న మూఢనమ్మకంతో ఓ వ్యక్తి.. చనిపోయిన తన భార్య కూతురు కోసం ఓ చిన్నారిని బలివ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.

దీనికోసం ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ రెండేళ్ల చిన్నారిని అపహరించి తీసుకొచ్చాడు. కాసేపటికి గమనించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు పాప గురించి అంతటా వెతికి, పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి ముందు ఆడుకుంటున్న తన చిన్నారి కనిపించకుండా పోయిందంటూ బోరున విలపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల తీవ్రస్థాయిలో గాలించడం మొదలుపెట్టారు. ఆ చిన్నారి కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు.

ఇంటి పక్కనే ఉన్న బావిలో ఆడుకుంటూ పడిపోయింది అని అనుమానంతో వెతికారు. కానీ దొరకలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలు వెతికారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే చిన్నారి అదృశ్యమైన ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అరటి తోటలో అలికిడి వినిపించింది. వింత శబ్దాలు వినిపించాయి. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా నరబలి ఏర్పాట్లు కనిపించాయి. అక్కడ రాసప్పన్ అనే ఓ వ్యక్తి  ఆ ఏర్పాటు చేస్తున్నాడు. 

గమనించిన పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నించారు. తన భార్య, కూతురు చనిపోయిందని వారి ఆత్మలు శాంతింపచేయడానికి రెండేళ్ల పాపను బలివ్వాలనుకున్నట్లుగా రాసప్పన్ తెలిపాడు. దీంతో షాక్ అయినా పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేశారు. పోలీసులు రావడం ఏమాత్రం ఆలస్యమైనా ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. మూఢనమ్మకానికి ఆ చిన్నారి బలయ్యేది. చిన్నారిని కాపాడిన పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. 

చీరలు కట్టుకుని నదిలోకి డైవింగ్.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వైరల్ వీడియో..

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటన ఛత్తీస్గఢ్లోని ధమ్ తరీ జిల్లాలో చోటుచేసుకుంది. 50 యేళ్ల బసంత్ సాహు అనే వ్యక్తి క్షుద్ర పూజలు చేస్తాడు. అతనికి శిష్యుడు కూడా ఉన్నాడు. అయితే, ఆ శిష్యుడు గురువుకే పంగనామం పెట్టాడు. క్షుద్ర శక్తుల కోసం ఏకంగా గురువునే చంపేశాడు. ఆ తర్వాత అతడి రక్తాన్ని తాగాడు.  చదువుతుంటేనే  కడుపులో తిప్పేస్తున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే శిష్యుడ్ని అరెస్టు చేశారు.  

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 50 సంవత్సరాల బసంత్ సాహు అనే వ్యక్తి క్షుద్ర పూజలు చేస్తుంటాడు. అతని దగ్గర రౌనక్ సింగ్ ఛబ్రా అలియాస్ మన్య చావ్లా (25) క్షుద్ర పూజలు నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో అన్ని పూజలు తెలిసిన తన గురువును చంపి.. అతని రక్తం తాగితే..  తనకు క్షుద్ర పూజలు వస్తాయని నమ్మాడు.  

దీనికోసం  తన గురువైన బసంత్ సాహు క్షుద్ర పూజలు చేస్తుండగా అతడి మీద దాడి చేసి చంపేశాడు. ఆ తరువాత అతడి రక్తం తాగాడు. తను అనుకున్న పని అయిన తర్వాత గురువు మృతదేహానికి నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. విషయం స్థానికుల ద్వారా తెలిసిన పోలీసులు సగం కాలిన మృతదేహాన్ని గురువారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu