మిషన్ సంజీవని : జొమాటోతో ఇంటికే కరోనా మందులు.. ఎలాగంటే..

By AN TeluguFirst Published May 7, 2021, 12:59 PM IST
Highlights

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులు మానవత్వాన్ని చంపేస్తున్నాయి. ఈ మహమ్మారి మీద దేశ జరుపుతున్న యుద్దంతో జొమాటో సంస్థ తన వంతు సాయాన్ని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తోంది. ఫుడ్ డెలివరీగానే తెలిసిన జొమాటో ఇప్పుడు కోవిడ్ మెడిసిన్ ను ఇంటికి సరఫరా చేయనుంది. 

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులు మానవత్వాన్ని చంపేస్తున్నాయి. ఈ మహమ్మారి మీద దేశ జరుపుతున్న యుద్దంతో జొమాటో సంస్థ తన వంతు సాయాన్ని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తోంది. ఫుడ్ డెలివరీగానే తెలిసిన జొమాటో ఇప్పుడు కోవిడ్ మెడిసిన్ ను ఇంటికి సరఫరా చేయనుంది. 

మిషన్ సంజీవనిలో భాగంగా జోమాటో డెలివరీ బాయ్స్ ఇప్పుడు నోయిడాలో హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషంట్లకు ఆరోగ్య శాఖ నుంది కరోనా కిట్లను ఇంటికి డెలివరీ చేయనుంది. దీంట్లో భాగంగా మొదటి విడతగా గౌతమ్ బుద్ద నగర్ లో మెడికల్ కిట్స్  సరఫరాను జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ లాలినకరే యాతిరాజ్ ప్రారంభించారు. 

అంతకుముందు కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో జిల్లా యంత్రాంగం హోం ఐసోలేషన్ లో ఉన్న దాదాపు 4,000 మంది రోగులకు మెడికల్ ప్రిస్క్రిప్షన్ ను జారీ చేసింది. అయితే, ఈ రోగులు ఆ మందులను స్వయంగా కొనుక్కోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్ నియంత్రణ, హో ఐసోలేషన్ లో భాగంగా ఇప్పుడు జోమాటో డెలివరీ బాయ్స్ అలాంటివారికి సహాయపడనున్నారు. ఈ మెడికల్ కిట్‌లో విటమిన్ సి, విటమిన్ డి, పారాసెటమాల్, అజిత్రోమైసిన్, డాక్సీ జింక్ మాత్రలు ఉన్నాయి.

డెలివరీ వ్యవస్థను ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఈ డెలివరీ వ్యవస్థను పర్యవేక్షించే పనిని ఎసిఎంఓకు అప్పగించినట్లు సిఎంఓ డాక్టర్ దీపక్ ఓహ్రి తెలిపారు. హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులకు నిర్ణీత సమయంలో మందులు అందేలా అతను చూస్తాడు. ఆ రిపోర్ట్ కార్డును ఆరోగ్య శాఖ మెయింటేన్ చేస్తుంది.

ఇదంతా హోం ఐసోలేషన్ లో ఉండేవారు బయటికి రాకుండా చూడడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఒంటరిగా ఉన్నామన్న భావన లేకుండా సపోర్ట్ సిస్టమ్ పనిచేస్తుంది. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే జిల్లా  పరిపాలన యంత్రాంగానికి సమాచారం అందించడం ద్వారా.. అవసరమైన వారికి సహాయం అందుతుంది. 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,14,188 కరోనా కేసులు నమోదయ్యాయి.  3,915 కరోనాతో మృతి చెందారు. దేశంలోని మొత్తం కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు 21.49 మిలియన్లు. కాగా ఇప్పటివరకు మొత్తం మరణాలు 234,083 కు చేరుకున్నాయి. ఒక్క ఈ వారంలోనే 1.57 మిలియన్ కేసులు, దాదాపు 500 మంది మరణించినట్లు రాయిటర్స్ తెలిపింది.
 

click me!