కరోనా పాజిటివ్.. బావిలో దూకి డ్రాయింగ్ టీచర్ ఆత్మహత్య... !

Published : May 07, 2021, 12:25 PM IST
కరోనా పాజిటివ్.. బావిలో దూకి డ్రాయింగ్ టీచర్ ఆత్మహత్య... !

సారాంశం

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ రావడంతో ఓ టీచర్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ రావడంతో ఓ టీచర్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 

వేలూరు జిల్లా లత్తురి సమీపంలోని పాట్టియనూరు గ్రామానికి చెంది ఏలుమలై (40)  మేల్‌మాయిల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో డ్రాయిగ్ టీచర్ గా పనిచేస్తున్నాడు. 

గత వారం రోజులుగా ఏలుమలైకి జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నాయి. దీంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. దీంట్లో పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. దీంతో ఈ నెల 3వ తేదీన వేలూరు అడుక్కంబరై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం చేరాడు.

అయితే బుధవారం సడెన్ గా కనిపించకుండా పోయాడు. అతని కోసం అంతా వెతికినా దొరకలేదు. ఈ క్రమంలో గురువారం ఆసుపత్రి సమీపంలోని చిరుకరుంబూరులోని వ్యవసాయ బావిలో ఏలుమలై మృతదేహం  తేలుతుండటంతో స్థానికులు గమనించి వేలూరు పోలీసులకు సమాచామిచ్చారు. 

వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బావిలోని మృతదేహాన్ని బైటికి తీసి విచారణ చేపట్టారు. ఆ మృతదేహం కరోనా భయంతో పరారైన ఏలుమలైగా గుర్తించారు.

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?