కరోనా వ్యాక్సినేషన్‌పై వ్యూహం లేదు: మోడీకి రాహుల్ లేఖ

By narsimha lodeFirst Published May 7, 2021, 12:43 PM IST
Highlights

కరోనా వ్యాక్సినేషన్ పై స్పష్టమైన వ్యూహాం లేకపోవడంతోనే  దేశం ప్రస్తుతం ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టబడిందని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. 

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ పై స్పష్టమైన వ్యూహాం లేకపోవడంతోనే  దేశం ప్రస్తుతం ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టబడిందని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రదానమంత్రి నరేంద్రమోడీకి ఆయన శుక్రవారం నాడు లేఖ రాశారు. దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఆయన కోరారు. కరోనా సునీమీ దేశాన్ని నిరంతరం నాశనం చేస్తున్నందున ఈ లేఖ రాయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. దేశంలో కరోనా వైరస్ ను వ్యాప్తి చెందేలా అనుమతించడం దేశానికే కాదు ప్రపంచానికి కూడ మంచిది కాదని రాహుల్ గాంధీ ఆ లేఖలో పేర్కొన్నారు.

 కరోనా వ్యాక్సిన్ పై ప్రభుత్వానికి సరైన వ్యూహాం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రాహుల్ ఆరోపించారు. అత్యవసర సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని రాహుల్ గాంధీ కూడా ప్రధానికి సూచించారు. మొత్తం జనాభాకు వేగంగా టీకాలు వేయాలని కోరారు. పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందించడంతో పాటు ఆర్ధిక సహాయం కూడ ఇవ్వాలని ఆయన ఆ లేఖలో మోడీని కోరారు. 

click me!