
తనను వదిలేయమని తన భార్యకి కూడా చెప్పానని ప్రముఖ రచయిత చేతన్ భగత్ చెప్పారు. ఇటీవల చేతన్ భగత్ పై ఓ మహిళా విలేఖరి మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు.
తనపై వస్తున్న ఆరోపణలు అన్నీ నిజం కాదన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఈ ఆరోపణలు విని తన భార్య ఎంతో బాధపడిందని ఆయన చెప్పారు. దీంతో.. తనను వదిలివెళ్లిపోమ్మని తన భార్య అనూషకి చెప్పినానని ఆయన వివరించారు.
‘నాపై ఆరోపణలు వస్తుండడంతో నా భార్యను తన పుట్టింటికి వెళ్లిపోమని చెప్పాను. కానీ ఆమె నా చేతులు పట్టుకుని ‘మనం శివపార్వతులంలాంటివాళ్లం. వారిద్దరూ అర్థనారీశ్వరులు. ఎప్పటికీ విడిపోరు. మనం కూడా అంతే’ అంది. నా భార్యకు నాపై ఎంత ప్రేమ ఉందో అప్పుడే నాకు తెలిసింది.’ అని తెలిపారు.