మనవరాలి పెళ్లి ఆపిన తాత...వియ్యంకుడితో కలిసి తండ్రిని చంపిన కొడుకు

sivanagaprasad kodati |  
Published : Nov 20, 2018, 02:23 PM IST
మనవరాలి పెళ్లి ఆపిన తాత...వియ్యంకుడితో కలిసి తండ్రిని చంపిన కొడుకు

సారాంశం

మనవరాలికి ఇష్టం లేని పెళ్లిన ఆపించిన తాతను అతని కుమారుడు దారుణంగా హత్య చేశాడు. కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురం సమీపంలోని కరేనిహళ్లికి చెందిన నివాసి కుమార్ తన 15 ఏళ్ల కూతురు పుష్పకు స్థానిక సుబ్రమణ్య కుమారుడు బాబుకిచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించాడు. 

అయితే ఈ వివాహం ఆమెకు ఇష్టం లేదు.. ఇంకా మైనర్ అవ్వడంతో పాటు పెద్ద చదువులు చదువుకోవాలనుకుంది. కుటుంబసభ్యులకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు. వివాహాన్ని ఆపాలని పలుమార్లు పుష్ప తండ్రికి చెప్పింది..

అయినప్పటికీ అతను వినకపోవడంతో తాత ఈశ్వరప్పకు తన బాధ చెప్పుకుంది. మనవరాలి సంతోషమే తన సంతోషంగా భావించే ఆయన ఆమె కన్నీటిని చూడలేకపోయాడు. పెళ్లి రోజు మహిళా-శిశు అభివృద్ధి శాఖ అధికారులకు ఫోన్ చేసి మైనర్ బాలికకు వివాహం జరుగుతుందని.. వచ్చి ఆమెను రక్షించాలని కోరాడు.

వెంటనే రంగంలోకి దిగిన అధికారులు వివాహ వేదిక వద్దకు చేరుకుని పెళ్లిని అడ్డుకున్నారు. అయితే పెళ్లి ఆగిపోవడం, బంధువులు ముందు చులకన బాలిక తండ్రి నివాసి కుమార్, వరుడి తండ్రి సుబ్రమణ్య ఇద్దరూ మద్యం తాగి ఈశ్వరప్పతో ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన వారిద్దరూ బండరాయితో తలపై మోది పరారయ్యారు.

తీవ్రంగా గాయపడ్డ ఈశ్వరప్పను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ పెద్దాయన మరణించాడు. విషయం తెలుసుకున్న నిందితులిద్దరూ భయంతో కుటుంబసభ్యులతో కలిసి ఊరు వదిలి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu