తల్లిపై అత్యాచార యత్నం, అడ్డుకున్న బాలుడిని..

Published : Nov 20, 2018, 12:37 PM IST
తల్లిపై అత్యాచార యత్నం, అడ్డుకున్న బాలుడిని..

సారాంశం

తల్లిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన వారిని మైనర్ బాలుడు తన శాయశక్తులా ప్రయత్నించి అడ్డుకున్నాడు. 


తల్లిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన వారిని మైనర్ బాలుడు తన శాయశక్తులా ప్రయత్నించి అడ్డుకున్నాడు. ఆ కోపంతో ఆ బాలుడిని అతి దారుణంగా కొట్టి చంపారు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముజఫర్ పూర్ జిల్లా ధరంపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ, తన కుమారుడితో కలిసి జీవిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన రాజేంద్ర షా అనే వ్యక్తి చెందిన దుకాణంలో పనిచేస్తూ.. ఆమె కొడుకుని పోషించుకుంటోంది.  కాగా.. ఆ దుకాణ యజమాని రాజేంద్ర షా కుమారుడు... పప్పు.. దుకాణంలో పనిచేసే మహిళపై కన్నేశాడు.

అతని స్నేహితులతో కలిసి దుకాణం వద్దకు వచ్చి.. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. కాగా.. అక్కడే ఉన్న ఆమె కుమారుడు అతనిని అడ్డుకున్నాడు. దీంతో.. కోపంతో రగిలిపోయిన పప్పు.. తన స్నేహితులతో కలిసి బాలుడిని చితకబాదాడు. తీవ్రగాయాలపాలైన బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు.

దీంతో.. నిందితులకు శిక్షవిధించాలని కోరుతూ.. గ్రామస్థులు బాలుడి శవంతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో.. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఘటన వివరాలను సేకరించారు. నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు రాస్తారోకో విరమించుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People
చెన్నై మెట్రో పనులు పరిశీలించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Reviews Chennai Metro Rail Works