
పంజాబ్ : pizza order తీసుకోవడానికి బయటికి వచ్చిన ఒక police official గమనించిన White Swift car ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. Blast జరిగిన వెంటనే బయటికి వెళ్లి గమనించగా కార్యాలయానికి దగ్గరగా నిలిపిన తెల్లటి స్విఫ్ట్ కారు మాయమయ్యింది. దీంతో ఆ కారు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మొహాలిలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌కు పిజ్జా డెలివరీ అయిన క్షణాల సమయంలోనే భవనంపై రాకెట్ దాడి జరిగింది. దీంతో పోలీసులకు వారి ప్రాథమిక ఆధారాలు అందించింది. మారుతీ స్విఫ్ట్‌లోని ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా గుర్తించేలా చేసింది.
సోమవారం సాయంత్రం 7:45 గంటల సమయంలో, రాకెట్‌తో నడిచే గ్రెనేడ్ లేదా RPG, ఇంటెలిజెన్స్ హెచ్‌క్యూలోని మూడవ అంతస్తులో పడింది. దీంతో గాజు అద్దాలు పగిలిపోయాయి, ఫాల్స్ సీలింగ్‌లో కొంత భాగం కూలిపోయింది. అయితే, పేలుడుకు కొద్ది నిమిషాల ముందు, ఒక ఇంటెలిజెన్స్ అధికారి పిజ్జా డెలివరీ కోసం బయటకు వెళ్లినట్లు తెలిసింది.
ఆ సమయంలో అతను గేటు నుండి బయటికి రాగానే, ఆఫీసుకు దగ్గరగా ఆపిన తెల్లటి స్విఫ్ట్ కారును గమనించాడు. ఇంటెలిజెన్స్ హెచ్‌క్యూ ముందు పెద్ద కార్ పార్కింగ్ ఉంది. కారును గమనించిన అతను పిజ్జాతో లోపలికి వెళ్లిపోయిన తరువాత నిమిషాల వ్యవధిలోనే పేలుడు సంభవించింది. వెంటనే అతను బయటకు వెళ్లి చూడగా, అక్కడ కారు కనిపించలేదు. దీంతో పంజాబ్ పోలీసులు ఈ కారుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని, ఆ ప్రాంతంలో దాదాపు 7,000 మొబైల్ ఫోన్ డంప్‌లను పరిశీలించారు. ఇంటర్నేషనల్ బోరర్ (IB) సమీపంలో డ్రోన్‌తో చిన్న సైజు RPG పడేసి ఉండవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.ఈ దాడి వెనుక ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ "రిండా" హస్తముందని పంజాబ్ పోలీసుకు చెందిన మరో ఉన్నతాధికారి తెలిపారు. సెక్యూరిటీ ఎస్టాబ్లిష్ మెంట్ పై దాడుల తీరును పరిశీలిస్తే, నిశ్చయంగా చెప్పలేకపోయినప్పటికీ.. రిండా హస్తాన్ని తోసిపుచ్చలేమని అధికారి తెలిపారు. దీనిపై బృందాలు నిశితంగా పని చేస్తున్నాయని, అయితే పోలీస్ స్టేషన్లపై గతంలో జరిగిన దాడులను సరిహద్దు అవతల నుంచి అతడు ప్లాన్ చేశాడని ఆయన తెలిపారు.
ఈ దాడితో ఇంటెలిజెన్స్ హెచ్‌క్యూలో భద్రతను పటిష్టం చేయడంపై దృష్టి సారించేలా చేసింది. ప్రాంగణంలో మెరుగైన CCTV కవరేజ్, క్యాంపస్‌లో ఇంటెన్సివ్ చెకింగ్, బారికేడింగ్ లాంటివి మరింత పటిష్టం చేయాల్సి ఉంది. రాష్ట్రంలో ఎక్కువ మంది పోలీసు అధికారులను రిండా ముఠా టార్గెట్ చేసే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అయితే, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం డిపార్ట్‌మెంట్‌లో తగినంత స్టాఫ్ లేదని, దీంతోపాటు మరిన్న ఆయుధాలు కావాలని అధికారులు సూచించారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి డ్రోన్స్ ద్వారా ప్రయోగిస్తుండడం.. ఒక పెద్ద సవాలు అని ఉన్నత అధికారి ఒకరు అన్నారు. అంతేకాదు వాటిని ఆపడానికి మనకు ఒక పద్ధతి ఎవాల్వ్ అయ్యేవరకు దీన్ని ఆపలేం అన్నారు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, మార్చి 9, 2022న కౌంటింగ్‌కు ఒక రోజు ముందు, రోపర్‌లోని కల్మా మోర్ వద్ద ఉన్న పోలీసు పోస్ట్‌పై దాడి జరిగింది, ఈ ఘటనలో దాని ప్రక్క గోడ దెబ్బతింది. ఎవరికీ గాయాలు కాలేదు.
నవంబర్‌లో, పఠాన్‌కోట్‌లోని ఆర్మీ కంటోన్మెంట్‌లోని త్రివేణి గేట్‌లో గ్రెనేడ్ లాబ్ చేయబడింది. నవాన్‌షహర్‌లోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కార్యాలయంలోని ఒక అధికారి ప్రధాన గేటుపై గ్రెనేడ్ విసిరినప్పుడు తృటిలో తప్పించుకున్నారు. రోపర్, పఠాన్‌కోట్, నవాన్‌షహర్‌లలో దాడి చేసినవారు భద్రతా స్థావరాలకు చాలా దగ్గరగా వచ్చి ఆపై తప్పించుకోగలిగారు.