ఘోరం.. మద్యం మత్తులో విద్యార్థిపై కోచింగ్ టీచర్ అత్యాచారం.. యూపీలో ఘటన

Published : Jan 28, 2023, 10:41 AM IST
ఘోరం.. మద్యం మత్తులో విద్యార్థిపై కోచింగ్ టీచర్ అత్యాచారం.. యూపీలో ఘటన

సారాంశం

కోచింగ్ సెంటర్ కు వెళ్లే 12వ తరగతి బాలికపై టీచర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బృందావన్‌లో జరిగింది. ఆ సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడని బాధితురాలు ఆరోపించింది. 

ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో ఓ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిపై కోచింగ్ టీచర్ మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాగే మరి కొంత మంది కూడా మద్యం తాగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. దీంతో మనస్థాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్య చేసుకునేందుకు యమునా నదిలోకి దూకింది. అయితే స్థానికులు ఆమెను రక్షించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. డాక్టర్‌ దంపతుల‌తో సహా ఐదుగురు మృతి..

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... 12వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఓ కోచింగ్ సెంటర్ కు వెళ్తోంది. అయితే ఓ పార్టీలో బాధితురాలికి మందు తాగించారు. తరువాత మద్యం తాగి ఉన్న టీచర్, మరి కొందరు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీశారు. ఇలా తనపై వారాల తరబడి అనేక సార్లు అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది.

ఉబర్ డ్రైవర్ మెసేజ్ ని ట్విట్టర్ లో షేర్ చేసిన మహిళ...!

ఇలాంటి ఘటనలు డజనుకు పైగా బాలికలపై జరిగాయని, అయితే పరువు పోతుందనే భయంతో ఎవరూ మాట్లాడలేదని బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటన తెరపైకి రావడంతో బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. అయితే పోలీసులు ఫిర్యాదు నమోదు చేయడానికి నిరాకరించారు. తాను తాగి ఉన్నానని చెబుతూ పోలీసులు చెంపదెబ్బ కొట్టారని ఆమె పేర్కొంది.

ఢిల్లీలో మరో దారుణం.. స్కూటీని ఢీకొట్టిన కారు.. కారు బానెట్‌ పై 350 మీటర్లు లాక్కెళ్లడంతో బాధితుడు మృతి..

అనంతరం బాధిత కుటుంబం తమకు న్యాయం చేయాలని కోరుతూ కనక్ ధార ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీ గౌతమ్‌ను సంప్రదించింది. దీంతో ఫౌండేషన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. విచారణ చేపట్టాలని పోలీసులను కోరింది. 

PREV
click me!

Recommended Stories

Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu
ఎవ్వరికీ సాధ్యం కాని మోదీ హిస్టారికల్ రికార్డ్ | Modi Creates History | Asianet News Telugu