భారత్ లో 4లక్షలకు చేరువలో కరోనా కేసులు

Published : Jun 20, 2020, 10:31 AM ISTUpdated : Jun 20, 2020, 02:54 PM IST
భారత్ లో 4లక్షలకు చేరువలో కరోనా కేసులు

సారాంశం

ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1,68,269 మంది చికిత్స పొందుతుండగా 2,13,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అప్పటికే ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల్లో మన భారత్ 4 వ స్థానంలో ఉండటం గమనార్హం.

భారత్ లో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే లక్షల మంది దీని బారిన పడగా, వేల మంది మృతి చెందారు. లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఒక్కసారిగా ఈ మహమ్మారి విజృంభణ తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

గత 24 గంటల్లో 14,516 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,95,048 కు పెరిగింది. అలాగే కొత్తగా 375 మంది కరోనాతో మరణించగా మొత్తం మరణాల సంఖ్య 12,948 కు చేరుకుంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1,68,269 మంది చికిత్స పొందుతుండగా 2,13,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అప్పటికే ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల్లో మన భారత్ 4 వ స్థానంలో ఉండటం గమనార్హం.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభణ భారీగానే ఉంది. రోజుకి దాదాపు 500కేసులు తెలుగు రాష్ట్రాల్లో నమోదు అవుతుండటం గమనార్హం. ఇప్పటికే తెలంగాణలో 6వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా... ఆంధ్రప్రదేశ్ లో 7వేలు దాటేసింది. దాదాపు 8వేలకు చేరువలో ఉంది. 

PREV
click me!

Recommended Stories

NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu