
ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి Amit shah జహంగీర్‌పురి హింసాత్మక ఘటనలపై ఢిల్లీ అడ్మినిస్టేషన్ తో సోమవారం మాట్లాడినట్లు సమచారం. Jahangirpuri హింసపై ప్రధానంగా బ్రీఫింగ్ సందర్భంగా, Hanuman Jayanti శోభా యాత్ర ఘర్షణలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని షా ఆదేశాలు ఇచ్చారని, తద్వారా ఢిల్లీలో ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా చూడాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి 2020 అల్లర్ల తర్వాత ఢిల్లీలో జరిగిన మొదటి మతపరమైన చిచ్చు ఇది. ఏప్రిల్ 16న నగరంలోని జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా రాళ్లదాడి, ఘర్షణల కారణంగా 8 మంది పోలీసు సిబ్బంది, ఒక పౌరుడు గాయపడ్డారు. ఆ తరువాత ఢిల్లీలో భారీ పోలీసులు మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు కాలీనడకన, మోటారు సైకిల్ పెట్రోలింగ్‌తో పాటు ఫ్లాగ్ మార్చ్‌లు కూడా నిర్వహిస్తున్నారు.
ఈ దాడి ఘటన మీద జహంగీర్‌పురి పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 147, 148, 149, 186, 307, 323, 332, 353, 427, 436.. ఆయుధాల చట్టంలోని సెక్షన్ 27 కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయబడింది.
సోను చిక్నా అరెస్ట్
జహంగీర్‌పురి రాళ్లదాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది, జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభా యాత్ర ఊరేగింపులో కాల్పులు జరిపినట్లు చూపిస్తున్న వీడియో ఒకటి బహిర్గతం అయ్యింది. ఆ వీడియోలో ఉన్న సోను చిక్నాను ఢిల్లీ పోలీసులు అంతకుముందు రోజే అరెస్టు చేశారు. సోను చిక్నా కోసం పోలీసు బృందం జహంగీర్‌పురి వెళ్లింది, అయితే అతని కుటుంబం, ఇరుగుపొరుగు పోలీసు బృందంపై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత తీవ్రతరం కాకుండా నిరోధించడానికి, ఘర్షణలను నివారించడానికి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) హ్యూమన్ షెల్ఫ్‌ను ఏర్పాటు చేసింది.
రాళ్ల దాడికి సంబంధించిన తాజా నివేదికను ధృవీకరిస్తూ, ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా, "నిజమే, దీనిమీద పోలీసులు దర్యాప్తు చేయడానికి వెళ్లారు. అయితే, వారిమీద కూడా కొన్ని రాళ్లు రువ్వబడ్డాయి. అయినప్పటికీ, పోలీసులు వెనకడుగు వేయలేదు. ఇది మా పని. దర్యాప్తు చేసి, సాక్ష్యాలను సేకరించి, నిజానిజాలను బయటికి తీసుకురావాలి. అందులో ఏదైనా అడ్డంకి ఉంటే, దానిమీద మేం చర్యలు తీసుకుంటాం’ అన్నారు.
మరోవైపు, జహంగీర్‌పురి హింస కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు అన్సార్, అస్లాంల పోలీసు కస్టడీని ఢిల్లీ కోర్టు రెండు రోజుల పాటు పొడిగించింది. సోమవారం కోర్టు ముందు హాజరుపరిచిన మరో నలుగురిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరో 12 మందిని ఆదివారం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. దీంతో ఏప్రిల్ 15న న్యూఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వారి సంఖ్య 16కు చేరింది.
కాగా, ఢిల్లీలో శనివారం సాయంత్రం హనుమాన్ జయంతి ఊరేగింపులో ఘర్షణ చోటు చేసుకుంది. ఓ వర్గం ఈ ర్యాలీపై రాళ్లు రువ్వింది. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మత ఘర్షణలో ఓ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ మేధలాల్ మీనా చేతికి బుల్లెట్ గాయమైంది. అయితే ఈ బుల్లెట్ పేల్చిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు అస్లాం అని గుర్తించారు. నిందితుడి నుంచి పిస్టల్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఈ మతపరమైన హింసలో ప్రమేయం ఉన్న 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు.