కాలం పరుగులతో సమాజంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నా.. సమాజంలో పాతుకుపోయిన కొన్ని అంధ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు తొలగిపోవడం లేదు. ఈ క్రమంలో ఇప్పటికీ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హర్యానాకు చెందిన ఓ వ్యక్తి.. మోక్షం అనే ముఢనమ్మకంతో తన కుటుంబాన్ని బలితీసుకున్నాడు.
ప్రస్తుతం మానవుడు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక టెక్నాలజీ తీసుకువస్తూ.. జాబిల్లిపై నివాసం ఉండే స్థాయికి చేరుకున్నాడు. కానీ సమాజంలో పాతుకుపోయిన కొన్ని మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలతో దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకృతిని ప్రేమించి.. జంతువులను ఆదరించే వ్యక్తి.. మోక్షం కల్పిస్తానంటూ.. తన కుటుంబాన్ని బలితీసుకున్నాడు. మూఢ నమ్మకాలతో కడుపున పుట్టిన బిడ్డలను, కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఆ తర్వాత తాను ప్రాణం తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల మృతదేహాలతో, వారి రక్తంతో ఇళ్లంతా బీభత్సంగా కనిపించింది. ఈ దారుణం చూసిన స్థానికులు తెగ భయపడిపోతున్నారు. ఈ దారుణ ఘటన హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటన సమాజంలో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు ఎంత బలంగా నాటుకుపోయాయనేదానికి నిలువుటద్దంలా నిలుస్తున్నది.
Also Read: Tax raids: వ్యాపారి ఇంట్లో గుట్టల కొద్ది నోట్ల కట్టలు.. సమాజ్‌వాదీ పార్టీపై విమర్శలు !
undefined
స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం.. ఉత్తర భారత రాష్ట్రమైన హర్యానాలోని హిస్సార్ నంగ్‌తలా గ్రామంలో రమేష్ వర్మ (45) తన కుటుంబంతో కలసి చాలా కాలం నుంచి నివాసం ఉంటున్నారు. ఆయన ఒక ప్రింటింగ్ ప్రెస్ ను కూడా నడుపుతున్నారు. ఎలాంటి ఇబ్బందుల లేకుండా ఆనందంగా సాగుతున్న కుటుంబం.. భార్యా పిల్లలను చాలా ఆప్యాయంగా చూసుకునే రమేష్. ప్రకృతిని ఎంతగానోప్రేమించే ఆయన.. తన ఇంట్లో రకరకాల మొక్కలను పెంచుతున్నాడు. పెంపుడు జంతువులు కూడా ఉన్నాయి. అయితే, ఉన్నట్టుండి ఒక రోజు ఆయన కుటుంబం మొత్తం ఇంట్లో రక్తపు మడుగులో పడివుంది. ఈ దారుణానికి పాల్పడింది రమేష్ కావడం సంచలనంగా మారింది. కుటుంబాన్ని ఎంతో ఆప్యాయంగా చుసుకున్న రమేష్.. అకస్మాత్తుగా తన భార్యా, పిల్లలను ఇనుపరాడ్డుతో కొట్టి చంపి ఇంటిని రక్తపుటేరుగా మార్చాడు. ఆ తర్వాత తాను వేగంగా వచ్చే లారీ అడ్డుగా వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా భయాందోళనలు రేకేత్తించింది. ఈ ఘటనలో భార్యా సునీత (38), ముగ్గురు పిల్లలు అనుష్క (14), దీపిక (12), కేశవ్ (10)లు మృతి చెందారు.
Also Read: Coronavirus: 18 ఏండ్లలోపు వారిపై ఒమిక్రాన్ పంజా
కాగా, ఈ ఘటనపై పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లోనూ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి డిన్నర్ తర్వాత పాయసంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి.. వారు నిద్రిస్తున్న సమయంలో వారిని రమేష్ వర్మ హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రమేష్ రాసిన సుసైడ్ లెటర్ సంచలనంగా మారింది. రమేష్ రాసిన లెటర్ తోనే ఈ హత్యలు ఎందుకు ఏశాడనేది పోలీసులకు తెలిసింది. మోక్షం కోసమే ఇలా చేసినట్టు లెటర్‌లో రాశాడు. తనతో పాటు ఇంట్లో అందరికీ మోక్షం జరగాలని చంపినట్టు లెటర్‌లో పేర్కొన్నాడు. అంతేకాదు తన ఇంటికి ఎప్పుడూ తాళం వేసి ఉంచాలని, ఇంట్లోనే తన ఆత్మ తిరుగుతూ ఉంటుందని లేఖలో రాసుకోచ్చాడు రమేష్. అలాగే, తన చితాభస్మాన్ని శ్మశాన వాటికలోని మొక్కలకు, చెట్టుకు మొదల్లో వేయాలని అందులో పేర్కొన్నాడు. స్థానికులు ఈ ఘటన నేపథ్యంలో భయాందోళనకు గురవుతున్నారు. వారు ఎంతో సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తుండేవారనీ, అకస్మాత్తుగా ఇలా చోటుచేసుకోడం దిగ్బ్రాంతికి గురిచేసిందని చెబుతున్నారు. సంవత్సరం క్రితం రమేష్ ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడనీ, అప్పటి నుంచి ఆయన కొంత మార్పును గమనించామని పలువురు పేర్కొన్నారు.