రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు, కేసు నమోదు

By Nagaraju TFirst Published Nov 15, 2018, 5:37 PM IST
Highlights

 ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, హిందూత్వవాది వీర్ సావర్కర్‌‌పై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. వీర సావర్కర్ పై రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

ముంబై: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, హిందూత్వవాది వీర్ సావర్కర్‌‌పై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. వీర సావర్కర్ పై రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

జైలు నుంచి విడుదలయ్యేందుకు సావర్కర్ బ్రిటీషర్ల కాళ్లుపట్టుకున్నారనీ వాళ్లు చెప్పినట్టు నడుచుకుంటానంటూ క్షమాపణలు చెప్పుకున్నారని రాహుల్ వ్యాఖ్యానించడాన్ని సార్కర్ కుటుంబ సభ్యులు తప్పుబడుతున్నారు. ఇటీవలే ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ సావర్కర్ జైలు నుంచి బయటపడేందుకు బ్రిటీషర్లకు క్షమాపణలు చెప్పారంటూ వ్యాఖ్యానించారు.

దీనిపై సావర్కర్ మునిమనవడు రంజీత్ సావర్కర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సావర్కర్‌ను బ్రిటీషర్లు 27 ఏళ్ల పాటు జైల్లో పెట్టారని అలాంటి వ్యక్తిపై రాహుల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశఆరు. సావర్కర్‌ను అప్రదిష్టపాలు చేస్తున్న రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

రంజీత్ సావర్కర్ ఫిర్యాదుతో ముంబైలోని శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌లో రాహుల్‌ గాంధీపై కేసు నమోదైంది. ఇకపోతే హిందూత్వ అనే భావాన్ని తొలిసారి ప్రవేశపెట్టిన వ్యక్తిగా వీర్ సావర్కర్ గుర్తింపు పొందారు. 

click me!
Last Updated Nov 15, 2018, 5:37 PM IST
click me!