ఫ్యాషన్ డిజైనర్ దారుణ హత్య

Published : Nov 15, 2018, 11:02 AM IST
ఫ్యాషన్ డిజైనర్ దారుణ హత్య

సారాంశం

ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మాలా లఖని(53)  దారుణ హత్యకు గురయ్యారు. 

ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మాలా లఖని(53)  దారుణ హత్యకు గురయ్యారు. ఆమెతోపాటు.. ఆమె ఇంట్లో పనిచేసే పనిమనిషి బహదూర్(50)ని కూడా హత్య చేశారు. వసంత్ కుంజ్ ఎన్ క్లేవ్ లోని ఆమె నివాసంలోనే ఈదారుణం చోటుచేసుకుంది.

కాగా.. ఈ కేసులో ముగ్గురు నిందితులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిజైనర్ మాలా లఖని వద్ద పనిచేసే ఓ టైలరే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చాలా రకాల దుస్తులను తనచేత కుట్టించి..వాటికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఈ హత్య చేసినట్లు టైలర్ రాహుల్ పోలీసుల ముందు అంగీకరించాడు.

తన బంధువులు ఇద్దరు వ్యక్తుల సహాయంతో ఆమెను హత్య చేశానని నిందితుడు అంగీకరించాడు. యజమానికి సహాయం చేసేందుకు ప్రయత్నించిన క్రమంలో.. ఇంటి పనిమనిషి ని కూడా చంపేశామన్నారు.

మృత దేహాలను పోస్ట్ మార్టానికి తరలించిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?