అక్కడ బలవంతపు మతమార్పిడులు సర్వసాధారణం...

By Sandra Ashok KumarFirst Published Dec 19, 2019, 1:19 PM IST
Highlights

తమ సామాజిక పరిస్థితుల గురించి చెబుతూ," మా కుటుంబాల్లోని అబ్బాయిలను అమ్మాయిలను ఎత్తుకుపోవడం అనేది సర్వసాధారణమైన విషయం. డబ్బులు చెల్లిస్తే అబ్బాయిలను తిరిగి అప్పగించేవారు. కానీ, అమ్మాయిలు మాత్రం ఎన్నటికీ తిరిగి వచ్చేవారు కాదు."

న్యూ ఢిల్లీ: పాకిస్తాన్ లో ఉన్న హిందువులు అనేక కష్టనష్టాలకోరుస్తూ తమ జీవనం సాగిస్తారన్న విషయం తెలిసిందే. ఈ కష్టాలన్నింటిలోకెల్లా అక్కడి హిందువులను అత్యంత తీవ్రంగా కలచివేసే అంశం ఏదన్నా ఉందంటే అది వారి ఇంటి ఆడపడుచుల మీద జరిగే ఆకృత్యాలు. 

పాకిస్తాన్ నుంచి శరణార్థి గా వచ్చి మజ్ను కి తిలా శరణార్ధుల శిబిరంలో తలదాచుకున్న గంగారాం ఏషియా నెట్ తో మాట్లాడుతూ తన ఆత్మఘోషను వెళ్లబోసుకున్నాడు. 2016లో ఆయనతోపాటు మరో 16 కుటుంబాలు మతపరమైన వీసాను పొంది పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకున్నామని చెప్పాడు.

 పాకిస్తాన్ లో మాకు వస్త్ర దుకాణాలు, ఇతర వ్యాపారాలు ఉన్నాయి. వాటన్నిటిని ఉన్నపళంగా వదిలేసి వచ్చాము. అక్కడ మా వ్యాపారాలను అక్కడి ఛాందసవాద అతివాద ముస్లిములు సాగనిచ్చేవారు కాదు " అని చెప్పుకొచ్చాడు. 

also read తమిళనాడులో.. తెలుగు టీచర్ అనుమానాస్పద మృతి

జీవితం నరకప్రాయం... 
తమ సామాజిక పరిస్థితుల గురించి చెబుతూ," మా కుటుంబాల్లోని అబ్బాయిలను అమ్మాయిలను ఎత్తుకుపోవడం అనేది సర్వసాధారణమైన విషయం. డబ్బులు చెల్లిస్తే అబ్బాయిలను తిరిగి అప్పగించేవారు. కానీ, అమ్మాయిలు మాత్రం ఎన్నటికీ తిరిగి వచ్చేవారు కాదు."

"బలవంతపు మతమార్పిడులు అక్కడ సర్వసాధారణమైన విషయం. జీవిస్తున్నాము అంటే ఏదో జీవచ్ఛవాలుగా జీవిస్తున్నాము తప్ప ఒక గౌరవప్రదమైన జీవనం మాత్రం మాకు దొరికేది కాదు. మా భార్యలను, చెల్లెళ్లను, అక్కలను, కూతుర్లను మేము కాపాడుకోలేకపోయేవారము. 

అక్కడ మాకు పౌరులుగా గుర్తింపు ఉండేదే కాదు. మేము కంప్లయింట్లు ఇచ్చినా కూడా ఎవరూ పట్టించుకోరు. అక్కడ రెండవ జాతి పౌరులుగా బ్రతకలేక పారిపోవడం తప్ప ఇంకో మార్గంలేక ఇలా భారత దేశం వచ్చాము" అని తన దీన గాథను పంచుకున్నాడు. 

భారతదేశం వచ్చాక ఇప్పుడు... 
భారతదేశం వచ్చిన తరువాత అక్కడ చిప్పబడి దుర్భర జీవితం గడుపుతున్న ఇతర హిందూ కుటుంబాలను అక్కడి నుండి బయటపడేయడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు. ఇప్పటికే దాదాపుగా ఒక 7వేల కుటుంబాలను ఆ నరకకూపం నుంచి బయటపడినట్టు చెప్పాడు. 

also read ఏకాంతంగా మాట్లాడాలని పిలిచి... కొండపై నుంచి తోసేసి..

అలా బయటకు వచ్చిన కుటుంబాలు ఇప్పుడు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లోని శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నారని అన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పౌరసత్వ చట్టం వల్ల తమ కష్టాలు తీరి గట్టెక్కుతామని, ఇక స్వతంత్రంగా జీవనం సాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేసాడు. 

పౌరసత్వ సవరణ చట్టం...
పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకల నుంచి వచ్చిన క్రిస్టియన్, జైన్, బౌద్ధ,హిందూ, సిక్కు, పార్శి మతస్థులు మతపరమైన హింసకు గురై భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించడం కోసం ఈ చట్టాన్ని రూపొందించారు. 2014 డిసెంబర్ 31లోగా భారత్‌లోకి శరణార్థులుగా వచ్చిన వారికి మాత్రమే భారత పౌరసత్వం లభిస్తుంది. గతంలో భారత్‌లో 11 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికే భారత పౌరసత్వం ఇవ్వగా.. ఇప్పుడు దాన్ని ఐదేళ్లకు తగ్గించారు.

click me!