పాఠ్యాంశాల్లో భాగంగా హిందూ మత గ్రంథాలను బోధించాలి: మధ్యప్రదేశ్‌ సీఎం సంచలన ప్రకటన

By Rajesh KarampooriFirst Published Jan 24, 2023, 3:36 AM IST
Highlights

మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో గీత, రామచరిత్ మానస్,  రామాయణాలను బోధించాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  ఆసక్తికర ప్రకటన చేశారు. 

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రభుత్వ పాఠశాలల్లో గీత, రామచరితమానస్,  వేదాలు వంటి హిందూ మత గ్రంథాలను బోధించనున్నట్లు ఆసక్తికర ప్రకటన చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా భోపాల్‌లోని ఓల్డ్ క్యాంపియన్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..  రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు, శ్రీమద్ భగవద్గీత లాంటివి  అమూల్యమైన పుస్తకాలని, మానవుడిని నైతికంగా, సంపూర్ణంగా తీర్చిదిద్దే సామర్థ్యం ఈ గ్రంథాలకు ఉందని సీఎం శివరాజ్ చౌహాన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మన మత గ్రంధాలన బోధించాలని ముఖ్యమంత్రిగా తాను చెబుతున్నానని అన్నారు. గీతా, రామాయణం, రామచరితమానస్‌ల సారాంశాన్ని బోధిస్తామనీ సీఎం అన్నారు. ఇతర సబ్జెక్టులతో పాటు ఈ మతపరమైన పుస్తకాలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

మన  ప్రతి శ్వాసలో రాముడు ఉన్నాడని, రాముడు లేకుండా ఈ దేశం శూన్యమని తాను వారికి చెప్పాలను కుంటున్నానని అన్నారు. రాముడు మన ఉనికి, రాముడు మన జీవితం, రాముడు మన దేవుడు,  రాముడు గుర్తింపు అని అన్నారాయన. రామ్‌చరిత్ మానస్‌పై బీజేపీయేతర నేతలు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రకటన చేశారు . 

రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు, శ్రీమద్భగవద్గీత ఇలా ఎన్నో అమూల్యమైన పుస్తకాలు మనవేనని, మనిషిని నైతికంగా తీర్చిదిద్దే సత్తా ఈ పుస్తకాలకు ఉందని సీఎం అన్నారు. అందుకే ముఖ్యమంత్రిగా ఉన్న నేను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మన మత గ్రంధాల విద్యను అందజేస్తామని చెబుతున్నా. రామాయణమైనా, మహాభారతమైనా, వేదాలైనా, పురాణాలైనా, ఉపనిషత్తులైనా మన అమూల్యమైన గ్రంథాలు. ఈ గ్రంథాలు మానవుని నైతికంగా మరియు సంపూర్ణంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ పవిత్ర గ్రంథాలను బోధించడం ద్వారా పిల్లలలో నైతిక, పరిపూర్ణ సిద్దిస్తుందని తెలిపారు.  

వెండి పళ్లెంలో పెట్టుకుని బ్రిటిష్ వారు స్వాతంత్య్రం ఇవ్వలేదని, ఎందరో విప్లవకారులు బలిదానం వల్ల స్వాతంత్ర్య సిద్దించిందనీ, స్వాతంత్య్రం సాధించిన ఘనత ఒక్క కుటుంబానికే దక్కిందన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఖుదీరామ్ బోస్, సర్దార్ పటేల్ సహా అనేక మంది స్వాతంత్య్ర పోరాటంలో తమ వంతు కృషి చేశారనీ, నేతాజీ పాదాల దగ్గర సాక్ష్యం చెబుతున్నానని సీఎం అన్నారు.

click me!