మతాంతర వివాహం: పాస్‌పోర్ట్‌కు నిరాకరణ, సుష్మా జోక్యంతో కథ సుఖాంతం

First Published Jun 21, 2018, 3:41 PM IST
Highlights

పాస్‌పోర్ట్ ఇచ్చేందుకు నిరాకరించిన అధికారులు 


లక్నో: మతాంతర వివాహం చేసుకొన్న ఓ జంటకు  పాస్‌పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించిన  జంట కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను సహాయం అడిగారు. వెంటనే ఆమె స్పందించి వారికి పాస్‌పోర్ట్ అందేలా చర్యలు తీసుకొన్నారు.  ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.


మతాంతర వివాహం చేసుకున్న కారణంగా ఓ జంటకు పాస్‌పోర్ట్‌ ఇవ్వడానికి నిరాకరించారు లక్నో పాస్‌పోర్ట్‌ అధికారులు. అంతేకాక అన్య మతస్తున్ని పెళ్లి చేసుకున్నందుకు సదరు మహిళను తీవ్రంగా అవమానించారు. దాంతో తమకు సాయం చేయండంటూ ట్విటర్‌ వేదికగా కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ను ఆ దంపతులు కోరారు. సుష్మా స్వరాజ్ వెంటనే స్పందించారు.  ఆ దంపతులకు పాస్‌పోర్ట్ వచ్చేలా చర్యలు తీసుకొన్నారు. 

నోయిడాకు చెందిన ఓ యువతి  ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. బుధవారం తన్వి కొత్త పాస్‌పోర్ట్‌ తీసుకోవడానికి స్థానిక పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి వెళ్లింది. అయితే అక్కడ వికాస్‌ మిశ్రా అనే అధికారి  తాను ముస్లింను వివాహం చేసుకున్నానే కారణంతో తనతో అవమానకరంగా ప్రవర్తించాడని తెలిపింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ వేదికగా సుష్మా స్వరాజ్‌కు వివరించింది.

ఈ విషయం గురించి బాధితురాలు సుష్మా స్వరాజ్‌కు ట్విట్టర్ వేదికగా  ఫిర్యాదు చేశారు.  సుష్మా మేడమ్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయంలోని అధికారులు ప్రజల పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారని నేను అసలు ఊహించలేదు. నేను ముస్లింని పెళ్లి చేసుకున్నానని ఓ అధికారి నన్ను అవమానించాడు. అంతేకాక మా ఇద్దరిలో ఎవరో ఒకర్ని పేరు మార్చుకోవాలని అంటున్నాడు. అందరు చూస్తుండగానే నా మీద కేకలు వేసాడు. ఇంతటి అవమానాన్ని నా జీవితంలో ఎప్పుడు ఎదుర్కోలేదు.  ప్రస్తుతం అతడు నా పాస్‌పోర్ట్‌తో పాటు నా భర్త పాస్‌పోర్ట్‌ను కూడా హోల్డ్‌లో పెట్టాడని ఆమె చెప్పారు. 

అతని ప్రవర్తన చూసి షాకయ్యా. నాకు వివాహం అయ్యి 12 ఏళ్ల అవుతుంది. ఇప్పటికి నా సర్టిఫికెట్లలో నా పేరు తన్వీ సేత్‌గానే ఉంది. పెళ్లి తర్వాత ఆడవాళ్లు పేరు మార్చుకోవాలనే నియమం ఎక్కడ లేదు. 


అయినా ఏ పేరు పెట్టుకోవాలన్నది నా వ్యక్తిగత విషయం. ఇది మా కుటుంబానికి సంబంధించినది. మాకు పాస్‌పోర్ట్‌ వచ్చేలా సాయం చేయండి అని ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌కు స్పందించిన సుష్మా స్వరాజ్ వారికి పాస్ పోర్ట్ వచ్చేలా  చర్యలు తీసుకొంది. ఎవరైతే అధికారులు ఆ జంటను అవమానపర్చారో వారే  ఆ జంటకు  పాస్‌పోర్ట్‌లు ఇచ్చారు.

click me!