గంజాయి సాగు చట్టబద్ధం చేయడంపై కమిటీ.. నెల రోజుల్లో నివేదిక

Published : Apr 07, 2023, 03:30 AM ISTUpdated : Apr 07, 2023, 03:36 AM IST
గంజాయి సాగు చట్టబద్ధం చేయడంపై కమిటీ.. నెల రోజుల్లో నివేదిక

సారాంశం

గంజాయి సాగును చట్టబద్ధం చేయడానికి, ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎమ్మెల్యేలతో ఓ కమిటీ వేశారు. నెల రోజుల్లో ఆ కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్కు తెలిపారు.  

సిమ్లా: గంజాయి సాగును చట్టబద్ధం చేయాలనే అంశాన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అధ్యయనం చేయడానికి సిద్ధమైంది. ఐదుగురు సభ్యులతో ఓ కమిటీ వేసింది. ఈ గంజాయి సాగును చట్టబద్ధం చేస్తే ప్రయోజనాలు, నష్టాలపై అధ్యయనం చేయనుంది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 

సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు సూచనల మేరకు స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఎమ్మెల్యేలతో ఓ కమిటీ వేశారు. ఈ కమిటీకి సారథిగా రెవెన్యూ మంత్రి జగత్ సింగ్ నేగి వ్యవహరిస్తారు. ఇందులో చీఫ్ పార్లమెంటరీ సెక్రెటరీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు హన్స్ రాజ్, పూరన్ చంద్ ఠాకూర్, జనక్ రాజ్‌లు సభ్యులుగా ఉంటారు.

గంజాయి సాగు వల్ల లాభ నష్టాలను బేరీజు వేసుకుని నెల రోజుల తర్వాత ఈ కమిటీ ప్రభుత్వానికి రిపోర్టు అందిస్తుంది. బీజేపీ ఎమ్మెల్యే పూరన్ చంద్ ఠాకూర్ చేసిన తీర్మానంపై చర్చ జరిపిన తర్వాతే కమిటీ వేయాలనే నిర్ణయం తీసుకున్నారు. 

గంజాయి ఆకులు, విత్తనాల మెడిసినల్ యూజ్ గురించి సంపూర్ణ సమాచారం అందిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం సుక్కు చెప్పారు. 

ఈ రిపోర్టు సమర్పించడానికి ముందు అక్రమంగా గంజాయి సాగు చేసే చోట్లకు కమిటీ వెళ్లనుందని సీఎం సుక్కు తెలిపారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లలోని కొన్ని జిల్లాల్లో గంజాయిని సాగు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని వాదిస్తున్నారు.

Also Read: బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు.. రేపు ఉదయం జైలు నుంచి బయటకు!

కన్నబీస్ సాగును ఉత్తరాఖండ్‌లోనూ చేపడుతున్నట్టు సమాచారం.

గంజాయి సాగును చట్టబద్ధం చేస్తే ప్రభుత్వాన్నికి ఎక్కువ డబ్బులు వస్తాయని వివరించారు .

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్