రెండు వారాల్లో 400% పెరిగిన కరోనా కేసులు.. వెలుగులోకిరాకుండా మరో 300% కేసులు!

Published : Apr 07, 2023, 02:21 AM ISTUpdated : Apr 07, 2023, 05:01 AM IST
రెండు వారాల్లో 400% పెరిగిన కరోనా కేసులు.. వెలుగులోకిరాకుండా మరో 300% కేసులు!

సారాంశం

కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. కానీ, అందుకు తగినట్టుగా టెస్టుల సంఖ్య పెరగడం లేదు. టెస్టుల సంఖ్యను పెంచాలని కేంద్రం సూచించినా రాష్ట్రాలు మాత్రం పెంచడం లేదు. గత రెండు వారాల్లోనే కేసులు 400 శాతం పెరిగాయి.  

న్యూఢిల్లీ: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం కలకలం రేపుతున్నది. గత రెండువారాల్లోనే కేసులు 400 శాతం పెరిగాయి. అంటే స్వల్పకాలంలోనే కేసులు భారీగా రిపోర్ట్ అవుతున్నాయి. ఇక్కడ మరో ఆందోళనకర విషయం ఏమిటంటే.. టెస్టుల సంఖ్య పెరగడం లేదు. టెస్టుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కేసులు భారీగా రిపోర్ట్ కావడం ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఎందుకంటే టెస్టుల సంఖ్య పెరిగితే ఈ కేసుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అసలు వెలుగులోకి రాని కేసులు సుమారు 300 శాతం ఉంటాయని ఓ కొత్త సర్వే వెల్లడించడం గమనార్హం.

కరోనా కేసులు పెరగడం మొదలవ్వగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. అందులో టెస్టుల సంఖ్య పెంచాలని సూచించింది. కానీ, రాష్ట్రాలు మాత్రం టెస్టుల సంఖ్యను పెంచడం లేదని తెలుస్తున్నది. కొన్ని రాష్ట్రాలైతే అసలు టెస్టుల సంఖ్యనే బులెటిన్‌లో రిపోర్ట్ చేయడంలేవు. 

కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ చాలా మంది కరోనా టెస్టు చేయించుకోవడం లేదని ఓ కొత్త సర్వే వెల్లడిస్తున్నది. దేశంలోని 303 జిల్లాల్లో 11 వేల మంది నుంచి సేకరించిన వివరాలతో ఈ సర్వే రిపోర్టు రూపొందించారు. ఈ సర్వే ప్రకారం, కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ టెస్టు చేసుకోనివారు 76 శాతం మంది ఉన్నారని తేలింది. తద్వార ఒక విషయాన్ని ఇది స్పష్టం చేసింది. కేసులు ఇప్పటికే భారీగా పెరిగాయని బులెటిన్‌ల ద్వారా తెలుస్తున్నది. కానీ, ఇలా టెస్టులు చేసుకోని వారి సంఖ్య బులెటిన్‌లో రిఫ్లెక్ట్ కాదు. ఆ కేసు అధికారిక లెక్కల్లోకి రాదు. ఇలా వెలుగులోకి రాని కేసులు సుమారు 300 శాతం ఉంటాయని ఈ సర్వే తెలిపింది.

నిజానికి టెస్టుల సంఖ్య పెంచితేనే కరోనా వ్యాప్తి, దాని తీవ్రతను అంచనా వేయడం సులవవుతుంది. వాస్తవ చిత్రం ఆధారంగా కట్టడి చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. టెస్టులు పెంచడం ద్వారా పాజిటివ్ వ్యక్తులతో గడిపిన వారిని వెంటనే ఐసొలేషన్‌లోకి పంపే అవకాశం ఉంటుంది. తద్వారా మరెన్నో కేసులు రిపోర్ట్ కాకుండా నివారించడానికి వీలుంటుంది.

Also Read: దుబాయ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారతీయుడు.. రూ. 11 కోట్ల పరిహారం

గతంలో కరోనా టెస్టులు గణనీయంగా చేశారు. ఇప్పటికీ ఈ టెస్టు సంఖ్యను పెంచి నిర్వహించే సామర్థ్యాలు ఉన్నాయి. ఫస్ట్, సెకండ్ కరోనా వేవ్‌లలో అంటే 2020లో 17.7 కోట్లు, 2021లో 54 కోట్ల టెస్టులు నిర్వహించారు. 2022లో ఈ సంఖ్య 19.5 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీ వరకు 1.1 కోట్ల టెస్టులు మాత్రమే నిర్వహించారు. ఈ ఏడాది XBB.1.16 వేరియంట్ కారణంగా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. 

కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు గత ఏడాది నుంచే కరోనా టెస్టుల సంఖ్యను బులెటిన్‌ లో రిపోర్ట్ చేయడాన్ని ఆపేశాయని అధికారులు తెలిపారు. వెస్ట్ బెంగాల్, బిహార్ రాష్ట్రాలు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కరోనా టెస్టుల సంఖ్యను వెల్లడించడం లేదు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్