హిమాచ‌ల్ ప్ర‌దేశ్: ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న మంచు.. 216 రహదారులు మూసివేత

Published : Feb 12, 2023, 11:21 AM IST
హిమాచ‌ల్ ప్ర‌దేశ్: ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న మంచు.. 216 రహదారులు మూసివేత

సారాంశం

Dharamshala: ఎగువ ప్రాంతాల్లో మంచు కురవడంతో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో 216 రహదారులు మూసివేశారు. కోఠిలో 20 సెంటీమీటర్లు, కల్పాలో 17 సెంటీమీటర్లు, గోండ్లలో 13.5 సెంటీమీటర్లు, కుకుంసేరిలో 5 సెంటీమీటర్లు, రాష్ట్ర రాజధాని సిమ్లా శివారులోని కుఫ్రీలో కూడా మంచు కురిసిన‌ట్టు వాతావరణ శాఖ తెలిపింది.  

Himachal Pradesh snowfall: ఎగువ‌ ప్రాంతాలైన కులు, లాహౌల్, స్పితి, కిన్నౌర్, సిమ్లా జిల్లాల్లో శనివారం మరోసారి మంచు కురిసింది. మంచు కారణంగా మూడు జాతీయ రహదారులు సహా 216 రహదారులు మూసుకుపోయాయి. లాహౌల్, స్పితిలో 119, కిన్నౌర్ లో 31, చంబాలో 19, కులులో 9, మండీలో 6, కాంగ్రాలో 2, సిమ్లాలో ఒకటి మూసివేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాల్లో మంచు కురవడంతో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో 216 రహదారులు మూసివేశారు. కోఠిలో 20 సెంటీమీటర్లు, కల్పాలో 17 సెంటీమీటర్లు, గోండ్లలో 13.5 సెంటీమీటర్లు, కుకుంసేరిలో 5 సెంటీమీటర్లు, రాష్ట్ర రాజధాని సిమ్లా శివారులోని కుఫ్రీలో కూడా మంచు కురిసిన‌ట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, 325 ట్రాన్స్ఫార్మర్లు, 10 నీటి పథకాలకు అంతరాయం కలిగిందని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. సిమ్లా పట్టణంలో వడగండ్ల వాన సైతం కురిసింద‌ని పేర్కొంది.

 

హిమపాతం సంభవిస్తే పర్యాటకులు, నివాసితులు అనవసర ప్రయాణాలు మానుకోవాలని లాహౌల్, స్పితి జిల్లా యంత్రాంగం సూచించింది. అలాగే, హిమపాతం కారణంగా మనాలి-లేహ్ జాతీయ రహదారి (జాతీయ రహ‌దారి నెంబ‌ర్ -03) మూసివేయబడిందని తెలియజేసింది. దర్చా-షింకులా రోడ్డు, కాజా రోడ్డు (ఎన్ హెచ్-505), గ్రాఫు నుంచి కాజా రోడ్డు, సుమ్డో నుంచి లోసార్ రోడ్డును కూడా అన్ని రకాల వాహనాలకు రాక‌పోక‌లు నిలిపివేశారు. టిండి సమీపంలో హిమపాతం సంభవించడంతో పాంగి-కిల్లార్ రాష్ట్ర రహదారి (ఎన్ హెచ్-26)ను మూసివేశారు.

 

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. మనాలిలో అత్యధికంగా 23 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సియోబాగ్ 17 మిల్లీమీటర్లు, భుంతర్ 15 మిల్లీమీటర్లు, రెకాంగ్ పియో-సరాహాన్ 13 మిల్లీమీటర్ల చొప్పున, చంబాలో 10 మిల్లీమీటర్లు, సిమ్లా, పాలంపూర్, నహాన్, సోలన్, డల్హౌసీ, ధౌలౌకౌన్, జుబ్బర్హట్టిలో 1 నుంచి 2 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని భార‌త వాతావ‌ర‌ణ విభాగం వెల్ల‌డించింది.

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం నుంచి పొడి వాతావరణం ఉంటుందని స్థానిక వాతావరణ కేంద్రం అంచనా వేసింది.  కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు లేదు.. కీలాంగ్ లో రాత్రిపూట మైనస్ 4.7 డిగ్రీల కనిష్టాన్ని నమోదు చేసింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మంచు కురుస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !