మంచులో యువకుడిలా దత్తాత్రేయ కేరింతలు.. స్నో బైక్‌ డ్రైవ్ చేసిన గవర్నర్

By Siva KodatiFirst Published Mar 27, 2021, 10:07 PM IST
Highlights

ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్‌ను రోహతంగ్ వద్ద దత్త్రాత్రేయ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్నో బైక్ నడిపి సందడి చేశారు. అనంతరం అధికారులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. 

సిమ్లాకో, కాశ్మీర్‌కో వెళితే మంచులో ఆడుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. చల్లని మంచు ముద్దల్ని చూస్తే.. చాలు వృద్ధులైనా సరే చిన్నపిల్లల్లా మారిపోతారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం ఇందుకు అతీతం కాదు.

గత కొద్ది రోజులుగా కురుస్తున్న మంచు వర్షంలో భూతల స్వర్గం జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి. మంచు తుఫాన్‌తో మరింత అందంగా కనిపిస్తోంది.

హిమపాతం స్థానికుల్లో కొంత ఇబ్బంది కలిగించినా.. చాలా ఆహ్లాదంగా ఉండటంతో వాతావరణాన్ని వారు అస్వాదిస్తున్నారు. అటు సిమ్లా ప్రాంతం భారీ మంచు దుప్పటి కప్పేసింది. దీంతో దత్తాత్రేయ మంచుతో తెగ ఎంజాయ్ చేశారు.

 

 

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. తాజాగా దత్తన్న మంచు కొండల్లో ‘‘స్నో బైక్ ’’ నడిపారు. వివరాల్లోకి వెళితే.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్‌ను రోహతంగ్ వద్ద దత్త్రాత్రేయ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్నో బైక్ నడిపి సందడి చేశారు. అనంతరం అధికారులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. 

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గమైన అటల్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అక్టోబర్ 3న ప్రారంభించారు. 9.02 కి.మీ పొడవైన ఈ సొరంగ మార్గాన్ని హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్‌తాంగ్‌ వద్ద నిర్మించారు.

2002 మే 26న అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఈ టన్నెల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా ఆయన మరణానంతరం గత డిసెంబరులో వాజ్‌పేయి 95వ జయంతి సందర్భంగా ఈ సొరంగానికి 'అటల్‌ టన్నెల్‌' అని పేరు పెట్టారు.

రూ.3,500 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ సొరంగం మనాలి- స్పితి వ్యాలీలను అనుసంధానం చేస్తుంది. తద్వారా మనాలి, లేహ్ ప్రాంతాల మధ్య 45 కి.మీ దూరం తగ్గుతుంది. 

click me!