దారుణం : తల్లీబిడ్డను ముక్కలుగా నరికి, గోనెసంచిలో కుక్కి.. ప్రియుడి ఘాతుకం..

Published : Mar 27, 2021, 04:38 PM ISTUpdated : Mar 27, 2021, 04:49 PM IST
దారుణం : తల్లీబిడ్డను ముక్కలుగా నరికి, గోనెసంచిలో కుక్కి.. ప్రియుడి ఘాతుకం..

సారాంశం

వివాహేతర సంబంధం ఓ తల్లి, బిడ్డ ఉసురు తీసింది. ప్రియురాలు, ఆమె బిడ్డను ముక్కలుగా నరికి హత్య చేసిన కేసులో ప్రియుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమిళనాడులో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు.. తేని జిల్లా ఉత్తమపాళయం సమీపంలోని క.పుదుపట్టికి చెందిన కరుప్పుస్వామి కుమార్తె కలైసెల్వి (22). ఈమెకు మదురై జిల్లా పేరావూరుకు చెందిన కాశి రాజన్‌తో వివాహమైంది.

వీరికి ఒక మగబిడ్డ ఉన్నాడు. 2020 సెప్టెంబర్‌లో కలైసెల్వి, బిడ్డతో బయటకు వెళ్లి అదృశ్యమైనట్లు యువతి తండ్రి కరుప్పుస్వామి ఉత్తమపాళయం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఈ క్రమంలో 2021 మార్చి 26న చిన్నమనూరు అయ్యనార్‌ ఆలయ కోనేరులో మూడు గోనె సంచులు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుస్తులు ఆధారంగా అవి కలైసెల్వి, ఆమె బిడ్డకు చెందినదిగా గుర్తించారు. 

విచారణలో వివాహానికి ముందే కలైసెల్వికి చిన్నమనూరుకు చెందిన వివాహితుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. వివాహం తర్వాత కూడా వీరి బంధం కొనసాగింది. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహించిన ప్రియుడు ప్రియురాలితో పాటు బిడ్డను ముక్కలుగా నరికి గోనెసంచిలో మూటగట్టి కోనేరులో పడేసినట్లు తెలిసింది. ప్రియుడితో సహా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !