Himachal Pradesh Bypolls Results: హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్ పార్టీ క్వీన్ స్లిప్..

By team teluguFirst Published Nov 2, 2021, 4:08 PM IST
Highlights

హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. 

హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు మండీ పార్లమెంట్ నియోజవర్గానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్‌లో ఇలాంటి ఫలితాలు బీజేపీ గట్టి షాక్ అనే చెప్పాలి. అర్కి నుంచి సంజయ్, ఫతేపూర్ నుంచి భవాని సింగ్ పథానియా, జుబ్బల్-కొత్కానీ నుంచి రోహిత్ ఠాకూర్ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. 

మండి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కూడా పత్రిభా సింగ్ విజయం సాధించారు. ప్రతిభా సింగ్ దివంగత సీఎం వీరభద్ర సింగ్ సతీమణి. ఈ స్థానానికి బీజేపీ కార్గిల్ యుద్ద వీరుడు బ్రిగేడియర్‌జ(రిటైర్డ్) కౌషల్ చాంద్ ఠాకూర్ బరిలో నిలిపింది. అయితే చివరి వరకు హోరా హోరిగా సాగిన పోరులో ప్రతిభా సింగ్ 10 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు.

Also read: Bypoll Results 2021: బీజేపీకి భంగపాటు?.. పశ్చిమ బెంగాల్‌లో ఆ రెండు సీట్లూ టీఎంసీ ఖాతాలోకి..!

ఇక, 2017లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 68 స్థానాలకు ఈ ఎన్నికల్లో బీజేపీ 44, కాంగ్రెస్ పార్టీ 21, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. దీంతో అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపీ అధికారాన్ని చేపట్టింది.

Also read: Huzurabad Bypoll Result 2021: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల.. లైవ్ అప్‌డేట్స్.. 

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ హవా.. 
ప‌శ్చిమ బెంగాల్‌లోని నాలుగు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలకు జ‌రిగిన‌ ఉప ఎన్నిక‌ల్లో టీఎంసీ అభ్య‌ర్ధులు భారీ మెజారిటీతో విజయం దిశ‌గా దూసుకుపోతున్నారు. ఈ ఫలితాలపై స్పందించిన మమతా బెనర్జీ ఇది ప్రజ విజయమని పేర్కొన్నారు. తృణమూల్ అభ్య‌ర్ధుల‌కు ప‌ట్టం క‌ట్టిన ఓట‌ర్ల‌కు మ‌మ‌తా బెన‌ర్జీ కృతజ్ఞ‌త‌లు తెలిపారు.

- కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో చోట గెలుపొందాయి. హంగల్ ‌‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 7,373 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సిండ్గిలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 

-అస్సాంలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షం విజయం సాధించాయి. మూడు స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా.. యూపీపీఎల్ రెండు స్థానాల్లో గెలుపొందింది.

click me!