ఆన్‌లైన్ పాఠాలు: స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఆవును అమ్మిన తండ్రి

By narsimha lodeFirst Published Jul 23, 2020, 2:05 PM IST
Highlights

పిల్లల చదువుల కోసం ఓ వ్యక్తి తన ఆవును విక్రయించాడు. కరోనా సమయంలో పిల్లలకు ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తున్నారు. ఈ సమయంలో తన పిల్లలకు ఆన్ లైన్ పాఠాలను వినేందుకు వీలుగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఆవును విక్రయించాడు ఓ తండ్రి. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
 


సిమ్లా:పిల్లల చదువుల కోసం ఓ వ్యక్తి తన ఆవును విక్రయించాడు. కరోనా సమయంలో పిల్లలకు ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తున్నారు. ఈ సమయంలో తన పిల్లలకు ఆన్ లైన్ పాఠాలను వినేందుకు వీలుగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఆవును విక్రయించాడు ఓ తండ్రి. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కుల్దీప్ కుమార్ అనే వ్యక్తి కంగ్రా జిల్లాలోని జ్వాలాముఖి గ్రామంలో నివాసం ఉంటున్నాడు.కుల్దీప్ కు ఇద్దరు పిల్లలు. ఒకరు నాలుగో తరగతి, మరొకరు రెండో తరగతి చదువుతున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి నుండి స్కూల్స్ మూసివేశారు.కరోనా కారణంగా స్కూల్స్ ఆన్ లైన్ లో పాఠాలు బోధించడం ప్రారంభించారు. ఆన్ లైన్ లో పిల్లలు పాఠాలు వినాలంటే స్మార్ట్ ఫోన్ అవసరం.

తన పిల్లలు ఆన్ లైన్ లో పాఠాలు వినేందుకు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడానికి బ్యాంకులను అప్పులు తీసుకొనేందుకు వెళ్లాడు. కానీ అతనికి లోన్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. బ్యాంకులో రూ. 6 వేల లోన్ కోసం ఆయన బ్యాంకుకు వెళ్లినా కూడ బ్యాంకర్లు ముందుకు రాలేదు.

ఆవు పాలు విక్రయించి ఆయన తన కుటుంబాన్ని పోషించేవాడు. ఇదే ఆయనకు జీవనాధారం. అయితే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు కుల్దీప్ కుమార్ తన ఆవును అమ్మాడు.

రూ.6వేలతో కొత్త స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేశాడు. కుల్దీప్ ఓ చిన్న పూరిగుడిసెలో నివాసం ఉంటున్నాడు. అతనికి బీపీఎల్ కార్డు కూడ లేదు. మరో వైపు తనకు ఆర్ధిక సహాయం అందించాలని ఆయన గ్రామపంచాయితీ కార్యాలయంలో సంప్రదించినా ఫలితం లేకపోయింది.

ఈ విషయం మీడియాలో రావడంతో జ్వాలాముఖి ఎమ్మెల్యే రమేష్ ధవాలా కుల్దీప్ కు ఆర్ధిక సహాయం అందించాలని బీడీఓను ఆదేశించారు. 

click me!