షాకింగ్ సర్వే.. ఇంట్లో ఉన్నా కరోనా

By telugu news teamFirst Published Jul 23, 2020, 11:22 AM IST
Highlights

 మన ఇంట్లోని వారి కారణంగా కూడా మనకు కరోనా సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సాంక్రమిక వ్యాధి నిపుణులు తేల్చిచెప్పారు. 

కరోనా వైరస్ దేశంలో ఎంతలా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేల సంఖ్యలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ కి భయపడి ఇంట్లో నుంచి కనీసం బయటకు అడుగు కూడా పెట్టనివారు చాలా మందే ఉన్నారు. అయితే.. కరోనా వైరస్‌ బయటి వాళ్ల కంటే ఇంట్లోని వాళ్ల నుంచి సోకేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయట.

మీరు చదివింది నిజమే. బయటకు వెళితే.. కరోనా సోకుతుందని భయపడుతున్నాం. అయితే.. మన ఇంట్లోని వారి కారణంగా కూడా మనకు కరోనా సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సాంక్రమిక వ్యాధి నిపుణులు తేల్చిచెప్పారు. 

ఇన్ఫెక్షన్‌ బారినపడిన 5,706 మంది, వారితో సన్నిహితంగా మెలిగిన 59వేల మంది కాంటాక్ట్‌ల ఆరోగ్య నివేదికల పరిశీలన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు వారు తెలిపారు. ప్రతి 100 మంది కొవిడ్‌ రోగుల్లో కేవలం ఇద్దరికే బయటి వారి నుంచి వైరస్‌ సోకగా.. ప్రతి 10 మందిలో ఒకరికి వారి కుటుంబ సభ్యుల నుంచే కరోనా ప్రబలిందని గుర్తించినట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల్లో 60 ఏళ్లకు పైబడినవారు, టీనేజర్ల నుంచే ఇన్ఫెక్షన్లు అధికంగా వ్యాపించాయని చెప్పారు. 
 

click me!